Site icon NTV Telugu

Bomb Threats: చంద్రబాబు, జగన్ ఇళ్లకు బాంబు బెదిరింపులు..

Baom

Baom

Bomb Threats: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో బాంబు బెదిరింపు హెచ్చరికలు తీవ్ర అలజడి రేపాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇళ్లతో పాటు తిరుపతిలోని పలు ప్రాంతాల్లో కూడా బాంబులు పెట్టినట్లు బెదిరింపు ఈ- మెయిల్స్ వచ్చాయి. ‘హోలి ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్స్’ పేరుతో భారీ పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు ఆ మెసేజ్ లో తెలిపారు. దీంతో అప్రమత్తమైన పోలీస్ అధికారులు.. ఆయా ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతి దాన్ని అడుగడుగునా చెక్ చేస్తున్నారు.

Read Also: Tollywood Actress : లక్కీ హీరోయిన్‌ చేతిలో 8 సినిమాలు..అన్ని బడా సినిమాలే

అయితే, ఈ నెల 6వ తేదీన తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన ఉన్న నేపథ్యంలో బాంబ్ స్వ్కాడ్ సిబ్బందితో పాటు ఉన్నతాధికారులు అలర్టు అయ్యారు. తాజాగా, బాంబు బెదిరింపులతో తిరుపతి, శ్రీకాశహస్తిలోనూ క్షుణ్ణంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. తిరుపతి అగ్రికల్చర్ కాలేజీలోని ముఖ్యమంత్రి హెలిపాడ్ దగ్గర కూడా నిశీతంగా పరిశీలన చేస్తున్నారు.

Exit mobile version