అధికార పార్టీ తీరుపై మండిపడ్డారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. అధికార పార్టీ అక్రమాలను ప్రశ్నించినందుకు మా పార్టీ నేతలపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.ధర్మవరం ఎమ్మెల్యే అక్రమాలను, అధికారపార్టీ ఆగడాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులకు తెగబడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో తెలుస్తోంది. ప్రెస్క్ క్లబ్ లో దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దాడుల వెనుక ఉన్న ఎమ్మెల్యే సహా అందరిపైనా కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలి. ఇప్పటికే ఈ విషయం పై రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడారు. డీజీపీ, ఇతర ఉన్నతాధికారులను ఈ విషయంపై కలుస్తున్నాం. దాడికి ప్రేరేపించిన వారిపైన చర్యలు తీసుకోవాలి. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి రాష్ట్రంలో పూర్తిగా శాంతిభద్రతలు లోపించాయన్నారు. ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలపై దాడులు కొనసాగుతున్నాయి.ధర్మవరంలో దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిందితులపై కేసులు నమోదు చేసి 24 గంటల్లో అరెస్టు చేయాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతాం అని విష్ణువర్థన్ రెడ్డి హెచ్చరించారు.
బీజేపీ నేతలపై దాడి గర్హనీయం అన్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. ధర్మవరంలో భారతీయ జనతా పార్టీ నేతలపై వైసీపీ దాడి చేయడం అధికార పక్షం దౌర్జన్యమే.ప్రెస్ క్లబ్ లో అందరూ చూస్తుండగా దాడికి తెగబడ్డారంటే దాష్టీకాలు ఏ స్థాయికి చేరాయో అర్థం అవుతోంది. ప్రజాస్వామ్య విలువలను పాటించే ప్రతి ఒక్కరూ ఈ దాడిని గర్హించాలి. పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించకపోతే నేర ప్రవృతి కలిగిన నాయకులు పేట్రేగిపోతారన్నారు మనోహర్.
Viral News : ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన వీణా-వాణి