GVL Narasimha Rao: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బీజేపీ ప్రజా పోరు యాత్ర ఉంటుంది.. 2024లో భారతీయ జనతా పార్టీ అనే రైలు అతివేగంగా, అత్యంత అద్భుతంగా ప్రయాణిస్తుంది.. వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ధీటుగా బీజేపీ పరుగులు పెట్టబోతోంది అని వ్యాఖ్యానించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. గుంటూరు రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల సౌకర్యం కోసం ఎంపీ నిధుల నుండి ఏర్పాటు చేసిన స్టీల్ బెంచిలను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అభివృద్ధి గురించి జాతీయ కార్యవర్గ సమావేశంలో చర్చించాం.. ఈనెల 24న జరిగే కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధిపై చర్చ ఉంటుందని తెలిపారు.
Read Also: Women’s IPL: ఫ్రాంచైజీ రేసులో 30 కంపెనీలు..బీసీసీఐకి కాసుల వర్షం
ఇక, ఆంధ్ర ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ తలవంచి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు జీవీఎల్.. ఆంధ్ర ప్రజలపై చేసిన కామెంట్లపై కేసీఆర్ సిగ్గు పడుతున్నాను అని ప్రకటించి ఆ తర్వాతే ఆంధ్రలో అడుగు పెట్టాలన్న ఆయన.. బీఆర్ఎస్ పార్టీని ఆంధ్ర ప్రజలు స్వాగతించరు.. ఆంధ్ర ప్రయోజనాలను దెబ్బతీసిన వ్యక్తి కేసీఆర్ అని ఫైర్ అయ్యారు.. రాష్ట్రంలో రాజకీయాలు చేసుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది. కానీ, ప్రజలను అవమానించిన కేసీఆర్ ఆంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని.. లేదంటే అడ్డుకుని తీరుతామని ప్రకటించారు.. మరోవైపు.. బీఆర్ఎస్ పార్టీకి వీఆర్ఎస్ ఇప్పిస్తామని ప్రకటించారు. మా పార్టీ నేతలు ఎవరు బీఆర్ఎస్‌లోకి వెళ్లే పరిస్థితి లేదని.. గతంలో మా పార్టీ నుంచి వెళ్లిపోయిన కొంత మం బీఆర్ఎస్‌లోకి వెళ్లారు.. కానీ, అది మా పార్టీ కి సంబంధం లేని విషయంగా చెప్పుకొచ్చారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు.