NTV Telugu Site icon

GVL Narasimha Rao: సీఎం ముందే ఎలా ప్రకటిస్తారు.. సుప్రీంకోర్టును వెక్కిరించినట్లే..

Gvl Narasimha Rao

Gvl Narasimha Rao

GVL Narasimha Rao: విశాఖపట్నం రాజధానిపై సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన వ్యాఖ్యలపై అన్ని రాజకీయ పార్టీ నేతలు స్పందిస్తున్నారు.. సీఎం వ్యాఖ్యలను తప్పుబడుతున్నాయి విపక్షాలు.. ఆ వ్యాఖ్యలపై స్పందించిన భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు.. సీఎం జగన్‌ వాఖ్యలు వివాదంగా మారాయన్నారు.. రాజధాని అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.. రాజధాని అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాలు రావాల్సి ఉంది.. కానీ, సీఎం వైఎస్‌ జగన్‌ ముందే ఎలా ప్రకటిస్తారు? అని నిలదీశారు.. విశాఖ రాజధాని కానుంది.. నేను అక్కడికి షిఫ్ట్ అవుతున్నా అని ఎలా పేర్కొంటారని ప్రశ్నించారు. సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టును వెక్కిరించినట్లే అవుతుందని విమర్శించారు జీవీఎల్‌..

Read Also: Balineni Srinivasa Reddy: కోటంరెడ్డిపై బాలినేని సంచలన వ్యాఖ్యలు..

ఇక, పార్లమెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై స్పందించారు జీవీఎల్.. గత తొమ్మిది సంవత్సరాల అభివృద్ధిపై రాష్ట్రపతి మాట్లాడారు.. తొమ్మిదేళ్ళ పర్ఫామెన్స్ ప్రోగ్రెస్ అని చెప్పవచ్చు అన్నారు. ప్రపంచంలో ఐదవ ఆర్థిక దేశంగా భారత్‌ నిలబడిందని.. ఆర్థికంగా భారత్ నిలదొక్కుకుందన్నారు.. కోవిడ్ వల్ల అనేక దేశాల్లో అర్ధిక పరిస్థితులు గందరగోళంగా మారింది.. కానీ, భారత్‌ మాత్రం కోవిడ్‌ విజృంభణ సమయంలోనూ నిలదొక్కుకుందని తెలిపారు ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు.. కాగా, ఏపీ రాజధానిపై సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. విశాఖపట్నం త్వరలో కార్యనిర్వాహక రాజధాని కాబోతుంది. విశాఖలో పెట్టుబడులకు మిమ్నల్ని ఆహ్వానిస్తున్నాం. రానున్న కొద్ది నెలల్లో నేను కూడా విశాఖకు షిప్ట్‌ అవుతున్నాను. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ను విశాఖలో మార్చి 3,4 తేదీలలో నిర్వహించబోతున్నామని ఆయన ఢిల్లీలో చెప్పుకొచ్చారు.. నేను మీ అందరినీ వ్యక్తిగతంగా ఆ సమ్మిట్‌కు హాజరు కావాలని ఆహ్వానిస్తున్నాను. సదస్సుకు హాజరు కావడంతో పాటు ఇక్కడ పెట్టుబడులకు కూడా ముందుకు రావాలి. మీతో పాటు మీ సహచరులను ఇతర కంపెనీ ప్రతినిధులను కూడా ఆ సదస్సుకు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు స్ధాపన, వ్యాపారం ఎంత సులభతరమో చూపించాలని విజ్ఞప్తి చేశారు సీఎం వైఎస్‌ జగన్‌.

Show comments