Site icon NTV Telugu

Vishnuvardhan Reddy: డీజీపీని కలిసిన బీజేపీ నేతలు.. తేజస్వీని కేసు తేల్చండి..

Vishnuvardhan Reddy

Vishnuvardhan Reddy

ఆంధ్రప్రదేశ్‌లో బీ-ఫార్మసీ విద్యార్థిని తేజస్విని మృతి కేసు సంచలనంగా మారింది.. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్లకు చెందిన తేజస్విని మృతికేసును దిశ పీఎస్‌కు అప్పగించారు.. అయితే, ఈ కేసులో వెలుగు చూస్తున్న నిజాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి.. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఏపీ బీజేపీ నేతలు.. బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని మరణంపై విచారణ జరిపించాలని డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డిని కోరారు. ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధుల బృందం డీజీపీని కలిసి వినతి పత్రం అందజేసింది.

Read Also: Minister Peddireddy: పవన్ క్లారిటీ ఇవ్వాలి.. బీజేపీ, టీడీపీతో కలిసి పోటీ చేస్తారా..?

సత్యసాయి జిల్లాలో బీఫార్మసీ విద్యార్ధిని తేజస్వీని మరణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది బీజేపీ ప్రతినిధి బృందం.. తేజశ్వినిపై ఆత్యాచారం, హత్య ఘటనపై సిట్ ఏర్పాటు చేయాలని డీజీపీని కోరినట్టు బృందానికి నాయకత్వం వహించిన ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అనేక ఘటనలు జరుగుతున్నాయి.. హోంమంత్రి గారు ఎందుకు జిల్లాల్లో పర్యటించటం లేదు? అని ప్రశ్నించారు. అత్యాచారం హత్య జరిగిన తర్వాత 5,10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డ ఆయన.. ఏపీలో నిజాయితీగా పని చేసే పోలీసు అధికారులు ఉన్నారు.. కానీ, వారికి అధికార పార్టీ ఒత్తిళ్లు ఉన్నాయని విమర్శించారు. బాధిత కుటుంబాలకు హెచ్చరికలు, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.. తెజస్విని కుటుంబ సభ్యలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. తెజస్విని కుటుంబ సభ్యులకు పూర్తిగా న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని ప్రకటించారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి.

Exit mobile version