SatyaKumar: కేంద్ర ప్రభుత్వ పథకం లెక్కలను సీఎం జగన్ ట్యాంపరింగ్ చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SatyaKumar: ఏపీ బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల్ జీవన్ మిషన్‌లో ఏపీ ప్రభుత్వం ఆశించిన ఫలితాలను సాధించడంలో ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. అయినా తప్పుడు లెక్కలు, ఉత్తుత్తి ప్రకటనలతో జగన్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని సత్యకుమార్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఈ విషయం గురించి ట్వీట్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి రక్షిత మంచి నీటిని అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకం ప్రవేశపెట్టిందని సత్యకుమార్ అన్నారు. అయితే ఏపీలో ఈ పథకం అమలు అధ్వాన్నంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈ పథకాన్ని వంద శాతం మేర అమలు చేశామని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం నివేదిక పంపిందని తెలిపారు.
కానీ వాస్తవానికి ఏపీలో కేవలం 20 శాతం గ్రామాలకు మాత్రమే జల్ జీవన్ మిషన్ పథకం ఫలాలు అందాయని సత్యకుమార్ వెల్లడించారు. జల్ జీవన్ మిషన్ లెక్కలను సీఎం జగన్ టాంపరింగ్ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలోని 3,544 గ్రామాలకు 100 శాతం కుళాయి కనెక్షన్ ఇచ్చినట్లు లెక్కలు చూపారని.. కానీ 735 గ్రామ పంచాయతీల్లో మాత్రమే పని పూర్తి చేశారన్నారు. అంటే కేవలం 20.74 శాతం మాత్రమే ఈ పథకం ఫలాలు అందాయని.. మిగిలిన 80.26% మోసమేనని సత్యకుమార్ ఆరోపించారు. ఇలాంటి తప్పుడు లెక్కలు చూపించడంలో జగన్ సిద్ధహస్తుడని చురకలు అంటించారు. తప్పుడు ప్రచారం చేస్తూనే జగన్ మూడున్నరేళ్ల పాటు పాలన సాగించారని ఆరోపించారు. తప్పుడు సలహాలు ఇవ్వడానికి ప్రత్యేకంగా 45 మంది సలహాదారులను పెట్టుకొని వారికి రూ.130 కోట్లు ఖర్చు పెట్టారంటూ ఏపీ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఎద్దేవా చేశారు.
Also Read
- Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్‌కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
- Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
- Gadikota Srikanth Reddy: 'ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు'.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
తప్పుడు లెక్కలు, ఉత్తుత్తి ప్రకటనలతో ప్రజలను మోసం చేసే సీఎం @ysjagan జల్ జీవన్ మిషన్ లెక్కలనూ టాంపరింగ్ చేసారు.
3544 గ్రామాలకు 100% కుళాయి కనెక్షన్ ఇచ్చినట్లు లెక్కలు చూపారు. కానీ 735 (20.74%) గ్రామపంచాయతీలు మాత్రమే పనిపూర్తీ అయినట్లుగా సర్టిఫికెట్ ఇచ్చాయి.
మిగిలిన 80.26% మోసం! pic.twitter.com/I8Be2jCtno
— Satya Kumar Yadav (@satyakumar_y) November 8, 2022
తాజావార్తలు
-
CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
-
Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
Alia Bhatt: “నా మనసు ముక్కలైంది”.. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
-
Healthy Diet : షుగర్ ఉందా.? ఈ 6 ఫుడ్ మిస్టేక్స్ మీ కిడ్నీలను దెబ్బతీస్తున్నాయ్.!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!