అపథ మొక్కుల వాడికే అపద వచ్చింది అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. అది టీటీడీ దేవస్థానమా, వైసీపీ దేవస్థానమా, జగన్ రెడ్డి దేవస్థానమా అని ప్రశ్నించారు. పాలకమండలి సభ్యులు మరియు ఎక్స్ అఫిషియో సభ్యులు 29 మంది, ప్రత్యేక అహ్వానితులుగా 50 మంది ఉన్నారు. ఇది అన్యాయం, అపచారం, ఇది రూల్స్ కి వ్యతిరేకం. వర్క్ బోర్డ్ మరియు క్రిస్టియన్ కి సంభందించిన సంస్థల్లో కలుగజేసుకు నే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని అడిగారు. ఈ జంబో ప్యాక్ తో పాలకమండలి సమావేశం ఎక్కడ నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయంలో ముల విరాట్ నుంచి జయ విజయులు వరకు ఈ పాలకమండలి సభ్యులు మరియు వారి కుటుంబ సభ్యులు సరిపోతారు… జగన్ కి చట్టం చుట్టమా…? చట్టంలో లేని నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు, ఇంతమంది సభ్యులు నియమించడం వెనుక కారణాలు ఏంటి అని అడిగారు.
ప్రభుత్వ పెద్దలకు ఎంత ముడుపులు అందాయి ప్రశ్నించిన ఆయన భారీగానే చేతులు మారాయి. శ్రీకాళహస్తి చైర్మన్ గా నియమించిన వ్యక్తికి, టీటీడీ పాలమండలి లో ప్రత్యేక అహ్వానితుడిగా చోటు ఎలా కల్పిస్తారు, ఆ జీఓ ఏమైంది… ఇప్పుడు నియమించిన పాలకమండలి సభ్యుల్లో చాలామందికి నేర చరిత్ర ఉంది, వారిని ఎలా పాలకమండలి లో చేరుస్తారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సమయంలో ఇంత మంది సభ్యులు ఆలయంలో ఉంటే, అధికారులు, ఉద్యోగులు ఎక్కడ ఉండాలి అని ప్రశ్నించారు.