కోనసీమ జిల్లాకి అ౦బేద్కర్ పేరు పెట్టడానికి అన్ని పార్టీలు అ౦గీకరి౦చాయని ప్రభుత్వం మాకు ఏమైనా లేఖ ఇచ్చి౦దా..? అని ప్రశ్నించారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమలాపురంలో ప్రభుత్వం ఓ చర్చకి తెరలేపి౦ది.. ప్రభుత్వానికి మారణ హోమం జరగడం కావాలని ఆరోపించారు. అమలాపురంలో వాళ్లే అంతా చేశారన్నా ఆశ్చర్య పోనక్కరలేదన్న ఆయన.. గతంలో ఇలాంటి ఘటనలు హైదరాబాద్‌లో చేశారని మండిపడ్డారు.. కోనసీమలో జరిగిన ఘటనకు ప్రభుత్వ వైఫల్యంగా పేర్కొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.. కోనసీమలో ఎప్పటి నుంచో రెండు వర్గాలకు విబేధాలు ఉన్నాయని.. కానీ, నిన్న జరిగిన పరిస్థితి మరో యుద్ధాన్ని తలపించిందన్నారు.
Read Also: Live: అమలాపురంపై ఘటనపై పవన్ స్పందన..
అయితే, ఆ యుద్ధం జరగడానికి కారణం సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఆయన వైఖరే అన్నారు సోము వీర్రాజు.. ఇక, బీజేపీ ఎక్కడా ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం గానీ, ఉద్యమంలో పాల్గొనడ౦ కానీ చేయలేదన్నారు.. దీని వెనుక బీజేపీ ఉంది, ఆర్ఎస్‌ఎస్ ఉందని చర్చల్లో మాట్లాడుతున్నారు.. త్రికరణ శుద్ధితో ఉన్న పార్టీ బీజేపీ.. అటువంటి వాటికి వెళ్లదని స్పష్టం చేశారు. ఇక, క్షణికమైన ఆవేశాలకి లోనుకావొద్దని కోనసీమ యువతకు అభ్యర్ధిస్తున్నాం.. మంత్రి, ఎమ్మెల్యే నివాసాలపై దాడులను ఖండిస్తున్నామని తెలిపారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.