Site icon NTV Telugu

US: అమెరికాలో విషాదం.. ఏపీ విద్యార్థిని అనుమానాస్పద మృతి!

Usap

Usap

అగ్రరాజ్యం అమెరికాలో మరో విషాదం చోటుచేసుకుంది. ఆంధప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల యార్లగడ్డ రాజ్యలక్ష్మి అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. వైద్య పరీక్షలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. నవంబర్ 7న యార్లగడ్డ చనిపోయినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Kochi: కొచ్చిలో అర్ధరాత్రి ప్రమాదం.. పగిలిన భారీ నీటి ట్యాంక్.. ఇళ్లు జలమయం

యార్లగడ్డ రాజ్యలక్ష్మి టెక్సాస్‌లోని ఏ అండ్ ఎమ్ యూనివర్సిటీ-కార్పస్ క్రిస్టి నుంచి పట్టభద్రురాలు. అమెరికాలోనే ఉంటూ ఉద్యోగం కోసం వెతుకుతోంది. ఇంతలోనే మృత్యువు వెంటాడింది. అపార్ట్‌మెంట్‌లో అకస్మాత్తుగా చనిపోయింది. రెండు రోజులుగా తీవ్ర దగ్గుతో బాధపడుతుందని స్నేహితులు చెబుతున్నారు. అయితే కచ్చితమైన కారణం తెలియాలంటే రిపోర్ట్ వచ్చాకే తెలుస్తుందని పోలీసులు అంటున్నారు. కుమార్తె మరణవార్తతో కుటుంబ సభ్యులు కన్నీరుగా విలపిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Mali: జిహాదీకి వ్యతిరేకంగా వీడియోలు.. మహిళా టిక్‌టోకర్‌ను చంపిన ఉగ్రవాదులు

నవంబర్ 7న, 2025న నిద్రలోనే ఆమె చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఉదయాన్నే లేపగా మేల్కోకపోవడంతో స్నేహితులు గుండెలు బాదుకుంటూ ఏడ్చేశారు. రెండు, మూడు రోజులగా తీవ్రమైన దగ్గు, ఛాతీ నొప్పితో బాధపడుతుందని బంధువు చైతన్య తెలిపారు.

ఇక మృతదేహాన్ని ఆంధప్రదేశ్‌కు పంపించేందుకు చైతన్య.. టెక్సాస్‌లో నిధులు సేకరిస్తున్నారు. రాజ్యలక్ష్మిది ఆంధప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలోని కర్మెచెడు గ్రామం. తల్లిదండ్రులు అన్నదాతలు. ఎన్నో కలలతో అమెరికాకు పంపినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Exit mobile version