NTV Telugu Site icon

Balineni Srinivasa Reddy: చంద్రబాబు ఎన్ని మేనిఫెస్టోలు ప్రకటించినా.. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు

Balineni On Cbn

Balineni On Cbn

Balineni Srinivasa Reddy Comments On Chandrababu Manifesto: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎన్ని కొత్త మేనిఫెస్టోలు ప్రకటించినా.. ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. అసలు చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలోని ఏ ఒక్క పథకం కూడా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇవ్వలేదని ఆరోపించారు. సీఎం జగన్ ఏదైనా పథకాన్ని ప్రకటిస్తే ప్రజలు నమ్ముతారు కానీ, చంద్రబాబును ఎవ్వరూ నమ్మరని దుయ్యబట్టారు. గతంలో చేసిన 600 వాగ్దానాల్లో ఎన్ని నెరవేర్చారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే సమయంలో వైసీపీ, జనసేన ఫ్లెక్సీ వివాదంపై స్పందిస్తూ.. వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపి, వైసీపీ వాళ్లే దౌర్జన్యం చేస్తున్నారని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. ఫ్లెక్సీలు చింపింది జనసేన కార్యకర్తలేని అందరికీ తెలుసన్న ఆయన.. ఈ ఘటనలపై తాము సామరస్యంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు.

Minister Mallareddy: ఏం ముఖం పెట్టుకుని వాళ్లు ఓట్లడుగుతారు..

ఇదే సమయంలో.. మంత్రి గుమ్మనూరు జయరాం సైతం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. 600 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు. చంద్రబాబును ప్రజలు నమ్మరని.. 2024 ఎన్నికల్లో చంద్రబాబుకు పరాజయం తప్పదని జోస్యం చెప్పారు. 2024లో టీడీపీ భూస్థాపితం అవుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు రాజకీయాలకు పనికిరాడని విమర్శించారు. రాష్ట్రాన్ని పాలించడానికి చంద్రబాబు అనర్హులని దుయ్యబట్టారు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానని చెప్పి, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. మళ్లీ జగనన్నే సీఎం అవుతారని, టీడీపీకి ఓటు అడిగే హక్కు లేదని మంత్రి జయరాం తేల్చి చెప్పారు.

Kidnap: కళ్ల ముందే కూతురు కిడ్నాప్.. తట్టుకోలేక రైలుకిందపడి పేరెంట్స్ ఆత్మహత్య

Show comments