Site icon NTV Telugu

Balakrishna: పార్లమెంట్లో సైకిల్ తొక్కిన బాలకృష్ణ

Aaaa

Aaaa

దేశ రాజధాని ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య. తన పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంశాలతో పాటు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిపై చర్చించారు బాలయ్య. పార్లమెంట్‌కు వెళ్లిన బాలకృష్ణ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. నటుడిగానే కాదు ప్రజాప్రతినిధిగా తన సేవా ప్రయాణం, ప్రజల పట్ల ఉన్న నిబద్ధతపై బాలకృష్ణ, స్పీకర్ ఓం బిర్లాకు వివరించారు. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా అందిస్తున్న సేవల గురించి లోక్‌సభ స్పీకర్‌కు బాలకృష్ణ ప్రత్యేకంగా వివరించారు.

Also Read:High Court: సిగాచి పరిశ్రమ ప్రమాదంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు.. 3రోజులు టైమ్..!

మరోపక్క కేంద్ర మంత్రులునితిన్ గడ్కరీ,హర్దీప్ సింగ్ పూరి,మనోహర్‌లాల్ ఖట్టర్,మన్సుఖ్ మందవీయ తదితరులతో బాలయ్య భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో బసవతారకం ఆసుపత్రి విస్తరణకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల ద్వారా మద్దతు కోరారు.

Also Read:Kingdom : కింగ్ డమ్ పార్ట్-2 వచ్చేది అప్పుడే.. నాగవంశీ క్లారిటీ

కేంద్ర ఆరోగ్య మంత్రిమన్సుఖ్ మందవీయని కలసిన బాలకృష్ణ గారు హిందూపురంలో ఒక ESI ఆసుపత్రి స్థాపన కోసం విజ్ఞప్తి చేశారు. నితిన్ గడ్కరీ తో జరిగిన చర్చల్లో, హిందూపురం చుట్టుపక్కల రింగ్ రోడ్ నిర్మాణం అవసరాన్ని సూచిస్తూ, హిందూపురం ప్రాంత అభివృద్ధికి అవసరమైన జాతీయ రహదారి ప్రాజెక్టుల్ని ప్రతిపాదించారు. పార్లమెంట్ ఆవరణలో ఉన్న పార్కింగ్‌లో విజయనగరం ఎంపీ అప్పలనాయుడు ఉపయోగించే సైకిల్‌ను చూసి, సంభ్రమాశ్చర్యాలకు గురైన బాలయ్య, ఓ పట్టి పట్టి సైకిల్ తొక్కేశారు.

Exit mobile version