Auto Driver Raju Killed Woman In Vizag And Escapes With Gold: పరిచయస్తుడే కదా అని ఒక మహిళ నమ్మి వెళ్తే.. ఆటో డ్రైవర్ ఆమెను అన్యాయంగా చంపేశాడు. ఆటోను స్టార్ట్ చేసే తాడుతో మెడకు బిగించి, దారుణంగా హతమార్చాడు. అనంతరం ఏమీ ఎరుగనట్టుగా మిన్నకుండిపోయాడు. అయితే.. బంధువులకు అనుమానం రావడంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు తమదైన శైలిలో విచారించగా.. అతడు అసలు నిజం కక్కేశాడు. ఆ మహిళను ఎందుకు చంపాడో చెప్పాడు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Doctor Stabbed To Death: వైద్యం చేస్తుండగా లేడీ డాక్టర్‌ని పొడిచి చంపిన పేషెంట్..
విశాఖపట్నంలోని తగరపువలస బాలాజీ నగర్‌లో రేసు గోపి అనే మహిళ తన ఏడేళ్ల కుమారుడితో ఒంటరిగా ఉంటోంది. మనస్పర్థల కారణంగా ఆమె భర్తకు విడాకులు ఇచ్చింది. కట్ చేస్తే.. బంధవుల ఇంట్లో శుభకార్యం ఉందని, ఆ కార్యక్రమానికి వెళ్లేందుకు రెడీ అయ్యింది. ఆ ఈవెంట్‌కు హాజరై.. తిరిగి ఇంటికి కూడా బయలుదేరింది. కానీ.. ఆమె ఇంటికి చేరుకోలేదు. దీంతో.. బంధవులు ఆమె కోసం ఆరాతీయడం మొదలుపెట్టారు. ఎంత వెతికినా కనిపించకపోవడంతో.. ఈనెల 1వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండో తేదీ మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె కోసం గాలించడం మొదలుపెట్టారు. మరోవైపు.. బంధవులుకు చేపలుప్పాడకు చెందిన ఆటో డ్రైవర్ మైలిపల్లి రాజుపై అనుమానం కలిగింది. రేసు గోపి అదృశ్యం వెనుక అతని హస్తం ఉండొచ్చని అనుమానించి, అతని గురించి పోలీసులకు తెలియజేశారు.
Rohit Sharma: రోహిత్ మరో చెత్త రికార్డ్.. చరిత్రలో తొలిసారి
బంధవులు ఇచ్చిన సమాచారంతో.. పోలీసులు రాజుని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో అతడ్ని విచారించారు. అప్పుడు ఆతడు తానే రేసు గోపిని హతమార్చినట్టు ఒప్పుకున్నాడు. ఆమె మృతదేహాన్ని చిలుకూరి లేఔట్ గెడ్డలో పడేసినట్టు చెప్పడంతో.. కుళ్లిన స్థితిలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. రేసు గోపికి, ఆటో డ్రైవర్ రాజుకి చాలాకాలం నుంచి పరిచయం ఉన్నట్టు విచారణలో తేలింది. వారి మధ్య సాన్నిహిత సంబంధం కూడా ఉండేదని, ఆ తర్వాత ఇద్దరు దూరమయ్యారని తేలింది. మళ్లీ శుభకార్యం వద్ద వీళ్లు కలుసుకున్నారని, ఆమె వద్ద బంగారం ఉందని తెలిసి రాజు ఆమెని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశాడని, అనంతరం 4 తులాల బంగారాన్ని రాజు ఎత్తుకెళ్లాడని తెలిసింది.