Father beat his daughter: కులం అంటే పిచ్చి. వేరొకరు ఏమనుకుంటారో అనే మాటే.. తప్ప. వారి జీవితంలో ఒకరిని కోల్పోతున్నామని మాత్రం మరిచిపోతున్నారు. కులం, మతం పేరుతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అందరూ సమానమే అనే మాట.. మాటలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. కులం, మతం వేరే.. మాటలు వేరే అనేవిధంగా సమాజం తయారైంది. ఆకలి వేస్తుంటే ఎవరు వచ్చి అన్నంపెట్టరు. కష్టాల్లో వుంటే ఆదుకునే వారు వుండరు. కులం, మతం అనే మాట వినపడితే చాలు.. వేలెత్తి చూపే వారు మాత్రం ముందుంటారు. అలాంటి వారు మనకు అవసరమా? నా కుటుంబం.. నా కుటుంబంతోనే ఆనందం. నాకు తోచినంత వేరొకరికి సాయం చేద్దాం అనే ఆలోచనలో ఏ ఒక్కరిలో కూడా కనిపించడంలేదు. వేరొకరు చెప్పేదే విని వారి కుటుంబంలోని వారిని కోల్పోయే పరిస్థితి ఎదురవుతుంది. కొందరు అది మరిచిపోతున్నారు. కులాంతర ప్రేమ వ్యవహారం ఓ కుటుంబంలో చిచ్చుపెట్టింది. వేరే కులం వారితో తన కూతురు ప్రేమలో పడిందని దారుణంగా హతమార్చాడు కన్న తండ్రి. ఈ దారుణమైన ఘటన అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం చెర్లోపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
పెద్దపప్పూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన స్వాతి (18) ఇంటర్ తప్పడంతో చదువు మానేసి ఇంటి వద్దనే ఉంటోంది. స్వాతి ఇటీవల ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. స్వాతి ప్రేమించిన అబ్బాయి వేరే కులం కావడంతో స్వాతి తండ్రి గుర్రప్పకు, స్వాతికి ఈ విషయంలో పలు మార్లు గొడవలు జరిగాయి. నిన్న శుక్రవారం ఈ విషయంలో తండ్రి కూతురు మధ్య వాగ్వాదం జరుగింది. దీంతో గుర్రప్ప ఆవేశంలో కూతురు స్వాతిని అక్కడే వున్న రోకలిబండతో అతి దారుణంగా కొట్టడంతో స్వాతి అక్కడికక్కడే మృతి చెందింది. తన కూతురు తమ కులం కాని వాడిని ప్రేమించిందన్న కోపంతోనే గురప్ప ఈ అఘాయిత్యానికి పాల్పడిన ట్లు తెలుస్తోంది. స్వాతి హత్య విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆమె మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామ రెవెన్యూ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పామిడి రూరల్ సి.ఐ.రామకృష్ణ తెలిపారు.
AP DGP Rajendranath Reddy: యువతీ యువకులకు కౌన్సిలింగ్ తప్పనిసరి