Roja Vs Atchannaidu: రోజాకు ఛాలెంజ్.. ఆమె గెలిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీచేయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం పార్టీకి 160 సీట్లు వస్తాయంటూ అచ్చెన్నాయుడు పెద్ద జోక్ చేశారని ఎద్దేవా చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. తిరుపతి ఎంపీ ఎన్నికల సమయంలో ‘పార్టీ లేదు.. తొక్కా లేదు’ అన్న వ్యక్తి ఇప్పుడు 160 సీట్లంటూ జోక్ చేస్తున్నారని.. గట్టి చట్నీ గట్టిగా తింటే అచ్చెన్నాయుడు 160 కిలోలు పెరుగుతారేమోగానీ.. నువ్వు గానీ చంద్రబాబు నాయుడు గానీ తలకిందులుగా తపస్సు చేసినా 160 సీట్లు కాదు కదా.. ఇప్పుడున్న 23 సీట్లు రావడం కూడా కష్టం.. నీకు సరదాగా ఉంటే టెక్కలిలో రాజీనామా చేసి ఎన్నికలకు రా.. అంటూ సవాల్ విసిరిన విషయం తెలిసిందే.. అయితే, అచ్చెన్నాయుడు కూడా అదే స్థాయిలో స్పందించారు.. టెక్కలిలో రాజీనామా చేయాలని రోజా సవాల్ విసిరితే.. నగరిలో రాజీనామా చేయాలని అచ్చెన్న ప్రతి సవాల్ విసిరారు.
Read Also: TS Assembly Session: సస్పెన్షన్‌పై హైకోర్టుకు బీజేపీ ఎమ్మెల్యేలు
Also Read
- AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
- Doctors Strike : జూనియర్ డాక్టర్ల సమ్మె.. ఏపీ సర్కార్‌కు వైద్యుల అల్టిమేటం.!
- Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
- YS Jagan Slams AP PPP Policy: ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’లా కొత్త PPP పాలసీ.. జగన్ తీవ్ర విమర్శలు
టీడీపీ లక్ష్యం 160 స్థానాలు.. ఓ మహిళా నాయకురాలు ఏదేదో కామెంట్లు చేస్తోందని మండిపడ్డ అచ్చెన్నాయుడు.. చంద్రబాబు, అచ్చెన్నాయుడు తల కిందుల తపస్సు చేసినా 160 సీట్లు రావంటున్నారు.. వచ్చేవి 160 సీట్లా.. ఓట్లా అంటూ కామెంట్లు చేస్తున్నారు. రోజాకు ధైర్యముంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఎన్నికలకు సిద్ధపడాలని సవాల్ విసిరారు.. నగరిలో టీడీపీ ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో ఆ స్థానాల్లో మేం పోటీ చేయబోమని ప్రకటించారు అచ్చెన్నాయుడు.. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించాకే మహిళలకు ఆస్తిలో హక్కు దక్కిందని గుర్తుచేసిన ఆయన.. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేలా చంద్రబాబు కృషి చేశారని.. ప్రజలు మోసపోయి.. జగన్‌కు ఓటేసి అధికారం కట్టబెట్టారన్నారు.. అధికారం కోసం ఏ గడ్డైనా తినే వ్యక్తి జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. కులం, మతం, ప్రాంతం వంటి అంశాలను పట్టించుకోని వ్యక్తి చంద్రబాబు అన్నారు. సింపతీ కోసం కోడి కత్తి డ్రామా ఆడారు.. అయినా దాని వల్ల సింపతీ రాలేదని.. మరింత సింపతీ కోసం తన బాబాయిని చంపేసినా పట్టించుకోని వ్యక్తి జగన్ అని ఆరోపించారు. 151 సీట్లు వచ్చినా.. అతి తక్కువ కాలంలో సీఎం వైఎస్ జగన్ విపరీతమైన వ్యతిరేకతను పెంచుకున్నారన్న ఆయన.. తెలుగు మహిళా అధ్యక్షురాలైన అనితను వైసీపీ ఎమ్మెల్యేలు అనరాని మాటలు అంటున్నారని ఫైర్ అయ్యారు అచ్చెన్నాయుడు.
- Tags
తాజావార్తలు
-
Iran-Trump: ట్రంప్ దిగిపోయేంత వరకు పోరాడతాం.. ఇరాన్ కొత్త శపథం
-
Retail Inflation: ఉల్లి-వెల్లుల్లి ధరల మంట.. 4.45%కి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
-
CM Revanth Reddy : మిల్లర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..
-
Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
-
AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..