ఏపీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆంధ్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. నేతలు పరస్పరం ఒకరినొకరు వ్యక్తిగత దూషణలతో రాజకీయాలు మరో యుద్ధాన్ని తలపిస్తున్నాయి. తాజాగా మంత్రి అనిల్‌కుమార్ ప్రతి పక్ష నాయకులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దౌర్భాగ్యమైన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడన్నారు. చంద్రబాబు నాయుడు. ఆయన సుపుత్రుడు రాష్ట్ర ముఖ్యమంత్రిని అనరాని మాటలు అన్నారన్నారు.
అనిల్ కుమార్ మాట్లాడుతూ సీఎంను ఆయన తల్లిని విమర్శిస్తే ఉప్పు ,కారం తిన్న వారు ఎవరు చూస్తూ ఉండరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనా డైనా ప్రజా సమస్యలపై పోరాటం చేశారా అని ప్రశ్నించారు. గుంటూరు జిల్లాలో ఉప్పు, కారం ఎక్కువగా తింటారు.. కాబట్టి పౌరుషం, రోషం ఎక్కువగా ఉంటాయన్నారు, ఓవైపు గిల్లడం మరో వైపు మాపై దాడి చేశారని దొంగ దీక్షలు చేయడమేంటని ప్రశ్నించారు. తండ్రి, కొడుకులు ఎన్ని దొంగ దీక్షలు చేసినా ఈ రాష్ట్రం లో ఎవ్వరు ఏమి చేయలేరన్నారు.
సాక్షాతు కేంద్ర ప్రభుత్వం డ్రగ్స్ తో ఏపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. డ్రగ్స్ ను ఎవరు ప్రోత్సహిస్తూన్నారో చూస్తే మీ మూలాలు కనిపిస్తాయని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. డ్రగ్స్ తీసుకునే అలవాటు మీకు ఉంటే దాన్ని వైసీపీ పై రుద్దడమేంటన్నరు. కులాల మధ్య చిచ్చు పెట్టడం.. మతాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప ఏం చేశారని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాపై దాడులు జరిగినా ఇక్కడే ఉన్నాం మీలా హైదరాబాద్ లో దాక్కోలేదని మంత్రి అనిల్ కుమార్ ప్రతిపక్షాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.