AP Students AI Wonder: ఏపీ విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ.. ఇంటి నుండే పోలీస్ కంప్లైంట్..!

  • ఇంటి నుంచే 10 నిమిషాల్లో పోలీస్ ఫిర్యాదు నమోదు
  • వయస్సుకు తగ్గట్టు మాట్లాడే స్మార్ట్ ఏఐ టెక్నాలజీ
  • పోలీస్ స్టేషన్ భయం లేకుండా డిజిటల్ కంప్లైంట్ సౌకర్యం
  • త్వరలో వాట్సాప్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ
Ai

Ai

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు సామాన్య ప్రజల కోసం, ముఖ్యంగా మహిళలు , వృద్ధుల కోసం ఒక విప్లవాత్మకమైన ఏఐ (AI) సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు. సాధారణంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటే చాలా మంది భయపడతారు లేదా మొహమాటపడతారు. ఈ ఇబ్బందులను తొలగిస్తూ, ఇంట్లో కూర్చునే కేవలం 10 నిమిషాల్లో ఫిర్యాదు నమోదు చేసే సాంకేతికతను వీరు అందుబాటులోకి తెచ్చారు. ఈ విద్యార్థులు తయారు చేసిన సిస్టమ్ ఒక మనిషిలాగా ఎదుటివారితో మాట్లాడుతుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, మాట్లాడే వ్యక్తి వయస్సును బట్టి ఇది తన సంభాషణను మార్చుకుంటుంది. చిన్న పిల్లలు ఫిర్యాదు చేయాలనుకుంటే వారి మానసిక స్థితికి తగ్గట్టుగా సున్నితంగా మాట్లాడుతుంది. పెద్దవారు లేదా వృద్ధులతో వారి స్థాయికి తగినట్లుగా సంభాషించి వివరాలను సేకరిస్తుంది.

Janasena MLA Arava Sridhar Case: ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ వివాదం.. వెలుగులోకి కీలక విషయాలు..

సాధారణంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలంటే సుమారు మూడు గంటల సమయం పడుతుంది. కానీ ఈ ఏఐ సిస్టమ్ ద్వారా కేవలం 10 నిమిషాల ఫోన్ కాల్ లేదా సంభాషణతో పూర్తి వివరాలను సేకరించి, ఆటోమేటిక్‌గా కంప్లైంట్ ఫైల్ చేసి సంబంధిత పోలీస్ అధికారులకు పంపిస్తుంది. దీనివల్ల పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలనే భయం ఉండదు , బాధితులు ఎంతో కంఫర్టబుల్‌గా తమ సమస్యను చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్టును తదుపరి దశకు తీసుకెళ్లేందుకు విద్యార్థులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం అందరూ వాట్సాప్ వాడుతున్నందున, ఈ ఏఐ సిస్టమ్‌ను వాట్సాప్‌లోకి ఇంటిగ్రేట్ చేయనున్నారు. దీనివల్ల ప్రజలు మరింత సులభంగా, ఒక మెసేజ్ లేదా వాయిస్ నోట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసే వీలుంటుంది. ఈ వినూత్న ఆవిష్కరణ భవిష్యత్తులో పోలీసింగ్ వ్యవస్థలో కీలక మార్పులు తీసుకువస్తుందని, ముఖ్యంగా బాధితులకు తక్షణ న్యాయం అందించడంలో తోడ్పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

Aarava Sridhar controversy: అరవ శ్రీధర్ వ్యవహారంపై బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు.. పవన్‌ కల్యాణ్‌ పరువు తీస్తున్నారు..!