AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
- రూ.2,08,406 కోట్ల పెట్టుబడులకు SIPB ఆమోదం
- 21,627 మందికి ఉద్యోగ అవకాశాలు
- డిసెంబరు నుంచి ఎస్క్రో ఖాతాల ద్వారా ప్రోత్సాహకాలు
- 175 MSME పార్కుల ఏర్పాటుకు ఏపీ సర్కార్ ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Investments : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశం అత్యంత కీలక నిర్ణయాలతో నిర్వహించబడింది. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా రూ. 2,08,406 కోట్ల విలువైన భారీ పెట్టుబడుల ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏకంగా 21,627 ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. వచ్చే డిసెంబరు నుంచి ఎస్క్రో ఖాతాల ద్వారా పారిశ్రామిక ప్రోత్సాహకాలను అందించనున్నట్లు ప్రకటించిన సీఎం, గ్రామీణ ప్రాంతాలు కూడా వేగంగా అభివృద్ధి చెందేలా పరిశ్రమల ఏర్పాటు ఉండాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాబోయే సెప్టెంబరు నాటికి రాష్ట్రంలో 175 ఎంఎస్ఎంఈ (MSME) పార్కులను అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
రాష్ట్రంలో ఏర్పాటు కాబోతున్న డిఫెన్స్ ప్రాజెక్టులు దేశానికే గర్వకారణంగా నిలుస్తాయని పేర్కొన్న సీఎం చంద్రబాబు, రాబోయే రోజుల్లో గ్రీన్ అమ్మోనియా, లిథియం ఐయాన్ బ్యాటరీలు, రోబోటిక్స్ వంటి భవిష్యత్తు సాంకేతిక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. 20వ ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదం పొందిన ప్రాజెక్టుల వివరాలను అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. సరికొత్త పారిశ్రామిక విధానాలు , మౌలిక వసతుల కల్పన ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
Also Read
- Doctors Strike : జూనియర్ డాక్టర్ల సమ్మె.. ఏపీ సర్కార్‌కు వైద్యుల అల్టిమేటం.!
- Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
- YS Jagan Slams AP PPP Policy: ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’లా కొత్త PPP పాలసీ.. జగన్ తీవ్ర విమర్శలు
- YS Jagan: ‘డీఎస్సీలో పనిచేసే ఉద్యోగికే ఫస్ట్ ర్యాంక్’.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. జగన్ సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
-
Abhijeet Dipke: త్వరలో జంతర్‌మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
-
Police Lathi Testing: పోలీసుల “లాఠీ”లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
-
Doctors Strike : జూనియర్ డాక్టర్ల సమ్మె.. ఏపీ సర్కార్‌కు వైద్యుల అల్టిమేటం.!
-
NTR : ఎన్టీఆర్‌కు సర్జరీ..కిమ్స్ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..