AP New Bar Policy: ఏపీ ఎక్సైజ్ శాఖ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. కొత్త బార్ పాలసీకి ఆశించినంత స్పందన రావడం లేదు. మిగిలిన 428 బార్లకు రీనోటిఫికేషన్ ఇచ్చినా.. 10 రోజుల్లో కేవలం 11 బార్లకే దరఖాస్తులు వచ్చాయి. ఇంకా 417 బార్లు ఖాళీగానే ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం రేపటితో గడువు ముగియాల్సి ఉండగా.. సోమవారం ( సెప్టెంబర్ 15న) లాటరీ నిర్వహించాల్సి ఉంది. అయితే, దరఖాస్తులు రాకపోవడంతో గడువును మూడోసారి పొడిగించారు. ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎక్సైజ్ డైరెక్టర్ నిశాంత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Also: Moosarambagh Bridge: మూసీకి పెరిగిన వరద.. ముసరాంబాగ్ బ్రిడ్జి మూసివేత..
అయితే, మొదటి విడతలో 840 బార్లకు నోటిఫికేషన్ ఇచ్చినా.. రెండు సార్లు గడువు పెంచిన తర్వాత 412 బార్లకే లైసెన్సులు ఖరారయ్యాయి. ఆ తరువాత మిగిలిన 428 బార్లకు రీనోటిఫికేషన్ ఇచ్చినా.. 10 రోజుల్లో పెద్దగా స్పందన రాకపోవడంతో అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. బ్యాంకు సెలవులు, వరదలు, వర్షాలు, కలెక్టర్ల సదస్సు లాంటి అంశాల ప్రభావం ఉందని ఎక్సైజ్ శాక చెబుతుంది. కానీ, బార్ల కోసం బిడ్ దాఖలు చేయడానికి వ్యాపారులు ఇంకా ముందుకు రాకపోవడమే అసలు సమస్యగా మారింది.