NTV Telugu Site icon

లోకేష్‌పై మంత్రి శంకర్‌ నారాయణ ఫైర్.. సీఎంపై ఇలా సమంజసమేనా..?

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ మంత్రి శంకర్‌ నారాయణ… అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన… రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని దున్న అని పేరు పెట్టి పిలవడం ఎంతవరకు సమంజసం అంటూ మండిపడ్డారు.. విద్యార్థి లోకాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నందుకు తెలుగుదేశం పార్టీకి సిగ్గు అనిపించడం లేదా? అంటూ ప్రశ్నించిన మంత్రి.. సాక్షాత్తు దెబ్బతిన్న విద్యార్థులే తమపై పోలీసులు లాఠీఛార్జి చేయలేదని అంటుంటే.. తమ రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులను వాడుకుంటున్నారని విమర్శించారు. కాగా, విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారంటూ విద్యార్థి సంఘాలు కూడా ఆందోళనకు దిగాయి.. మంగళవారం ఏకంగా విద్యాశాఖ మంత్రి ప్రెస్‌మీట్‌లోకి దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాల నేతలు.. మంత్రి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ చేసిన సంగతి విదితమే.