NTV Telugu Site icon

Minister Peddireddy: పవన్ క్లారిటీ ఇవ్వాలి.. బీజేపీ, టీడీపీతో కలిసి పోటీ చేస్తారా..?

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు పొత్తుల గురించే మొత్తం చర్చ… ఏ పార్టీ నేత నోట విన్నా.. అదే మాట… పొత్తుల విషయంలో టీడీపీ, జనసేన, బీజేపీని టార్గెట్‌ చేస్తోంది అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ… పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. పవన్‌ కల్యాణ్‌.. బీజేపీ, టీడీపీలతో కలిసి పోటీ చేస్తారా..? లేక బీజేపీని వదిలి టీడీపీతో కలిసి పోటీ చేస్తారా..? అని నిలదీశారు. ఇక, చంద్రబాబు, పవన్ తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నారని.. చంద్రబాబు ముసుగుగా పవన్ కల్యాణ్‌ మారారు అంటూ మండిపడ్డారు.

Read Also: Konda Vishweshwar Reddy: మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి కొత్త పార్టీ..?

మరోవైపు, ప్రజలు తిరస్కరిస్తారనే భయంతోనే చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని వ్యాఖ్యానించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు లేదన్న ఆయన.. చంద్రబాబు అన్ని పార్టీల పొత్తుతో పోటీ చేయాలనే మేం కోరుకుంటున్నాం అన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. వైఎస్‌ జగన్‌పై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 2024లో ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కాగా, కాకినాడలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యల తర్వాత పొత్తుల రచ్చ మొదలైంది.. కానీ, తాన వ్యాఖ్యలు వక్రీకరించారు.. అసలు పొత్తుల గురించి తాను మాట్లాడిందేలేదంటున్నారు చంద్రబాబు.