జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనపై విమర్శలు వచ్చాయి.. ఓవైపు మంత్రుల కాన్వాయ్‌పై దాడులు చేశారంటూ జనసైనికులపై కేసులు కూడా పెట్టారు. అయితే, విశాఖ చేరుకున్న పవన్.. ఎయిర్‌పోర్ట్ నుంచి నిర్వహించిన రోడ్‌షోతో ఎంతో మంది ఇబ్బంది పడ్డారని విమర్శిస్తోంది అధికార పార్టీ.. ఇక, విశాఖ పర్యటనలో తనపై ఆంక్షలు, జనసైనికుల అరెస్ట్‌లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు పవన్ కల్యాణ్.. దీంతో, ఆయన కామెంట్లకు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. విశాఖలో పవన్ చేసిన పనివల్ల నేను గంటన్నరపాటు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయనని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ఇక, పవన్ కల్యాణ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు.. ఆ పార్టీకి ఓ విధానం లేదు అని మండిపడ్డారు.. నోరుంది కదా అని మాట్లాడితే వ్యవస్థలు సహించవు అని హెచ్చరించారు.. అందరూ చెప్పులు చూపిస్తే నువ్వు ఏమవుతావ్ పవన్ అంటూ ప్రశ్నించిన ఆయన.. చెప్పులు నీకేనా..? మాకు చెప్పులున్నాయన్నారు.. టీడీపీతో టై అప్ అయ్యారు కాబట్టే ప్యాకేజీ స్టార్ అనే కామెంట్లు వచ్చాయని.. తాను ప్యాకేజ్ స్టార్ కాదని పవన్ నిరూపించుకోవాలని సవాల్ చేశారు.
Read Also: Power Bill: కరెంట్ బిల్లు చూస్తేనే షాక్.. వందల్లో వచ్చే బిల్లు.. వేలు దాటింది..!
పవన్.. చంద్రబాబు దత్తపుత్రుడని మొదట్నుంచి వైసీపీ చెబుతూనే ఉందన్నారు బొత్స.. వైసీపీ చెప్పింది నిజమేనని నిన్నటి భేటీతో నిరూపితమైందన్న ఆయన.. జనసేన రాజకీయ పార్టీ కాదు.. సెలిబ్రిటీ సంస్థ అంటూ సెటైర్లు వేశారు. తనంతట తానే పవన్ వాళ్ల పార్టీ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటే ఎవరేం చేయగలరు..? అని ప్రశ్నించారు.. నాలుగు గోడల మధ్య జరిగే కార్యక్రమానికి పోలీసులు అభ్యంతరం చెప్పలేదని స్పష్టం చేసిన ఆయన.. పవన్ చేసిన ర్యాలీ వల్ల నేనే గంటన్నర ట్రాఫిక్‌లో ఆగిపోయాను అన్నారు. ఇక, పేర్ని నాని కుటుంబానికి రాష్ట్రంలో గౌరవం ఉంది.. కానీ, పవన్ మాట్లాడేవన్ని సొల్లు కబుర్లే అని ఎద్దేవా చేశారు.. రాజకీయ పార్టీ ముసుగేసుకుని పవన్ లాంటి వారు రావడం వల్ల రాజకీయాలకు విలువలు పడిపోయాయన్న ఆయన.. పవన్ మాటలు విన్నప్పట్నుంచి నా రక్తం ఉడికిపోతోంది.. సహనం కోల్పోతే ఎవరికి నష్టం.. వాళ్ల వ్యక్తిత్వమే బయటపడింది అన్నారు.
మరోవైపు, చంద్రబాబును చూస్తే రంగులు మార్చే ఊసరవెల్లే సిగ్గు పడుతోందని మండిపడ్డపడ్డారు బొత్స.. ఓ ఎన్నికలో మాట్లాడిన మాట మరుసటి ఎన్నికల్లో మాట్లాడరన్న ఆయన.. చంద్రబాబు అవినీతికి.. దోపిడీకి ప్రతిరూపం అని సంచలన ఆరోపణలు చేశారు. ఇక, రాజమండ్రిలో పాదయాత్రపై దాడి ఘటనలో మా ఎంపీని సమర్ధించను.. రైతుల ముసుగులో ఉన్నవారినీ సమర్థించబోనన్నారు బొత్స.. పాదయాత్ర చేస్తున్న తెలుగు దేశం నేతలే ముందు బాటిళ్లు విసిరినట్టు కన్పించిందన్న ఆయన.. యాత్రలో ఉన్న టీడీపీ నేతలే ముందుగా దాడి చేసిన విజువల్స్ నా దగ్గర కూడా ఉన్నాయన్నారు.. తప్పును తప్పూ అని సమర్థించే నాలాంటి నేత రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా..? అని ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ.
