పవన్ సినిమా టికెట్ల గురించి చంద్రబాబుకి ఏంనొప్పి..! మంత్రి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కల్యాణ్ సినిమా టికెట్ల ధరలు పెంచొద్దు అంటే చంద్రబాబుకు ఏం నొప్పి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన మూడు ఒక్కటే అని తేలిపోయిందని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన మేలును చెప్పుకుంటూ.. గర్వంగా తాము ఓటు అడుగుతున్నామన్న ఆయన.. కానీ, టీడీపీ ఏమీ చెప్పుకొని ఓటు అడుగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.. ఈ ఎన్నికలు మా అభివృద్ధి, సంక్షేమానికి రెఫరెండంగా భావిస్తూ..ప్రజల్లోకి వచ్చాం.. మా మంత్రి పెద్దిరెడ్డి ఇచ్చిన రాజీనామాల సవాల్ ని స్వీకరించే దమ్ము మీకు ఉందా? అని ప్రశ్నించారు.
ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఎన్నికల ప్రచార సభ విరమించుకుంటే దానిపై కూడా రాజీనామా? అని మండిపడ్డారు మంత్రి అనిల్.. మరి పవన్ కల్యాణ్ సిబ్బందికి కరోనా వస్తే.. పవన్ ఇంట్లో పడుకుంటే.. టీడీపీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.. మరోవైపు.. వకీల్ సాబ్ సినిమా టికెట్ల వ్యవహారంపై స్పందించిన మంత్రి అనిల్.. పవన్ సినిమా టికెట్ల ధరల పెంచొద్దు అంటే.. చంద్రబాబు ఏం నొప్పి అంటూ ఫైర్ అయ్యారు.. బ్లాక్ మార్కెట్ ని మేం ప్రోత్సహించాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, వకీల్ సాబ్ ని చూసి సీఎం జగన్ బయపడ్డాడని అంటారా.?… ఏ సాబ్ వచ్చినా మా లీడర్ వణకడు.. ఆయన చాలా మందిని చూశారని చెప్పుకొచ్చారు.. ఈ నెల 17వ తేదీ తర్వాత మీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధంగా ఉండాలంటూ సవాల్ విసిరిన మంత్రి అనిల్.. ఆ ఏడుకొండల వెంకన్న ఆశీసులు ఎవరికున్నాయో 17 తర్వాత తేలిపోతుందన్నారు. మీ మీద మీకు నమ్మకం వుంటే… మీ ఎమ్మెల్యేలు, ఎంపీ లు అందరూ రాజీనామా చేసి రండి.. ప్రజల్లో ఎవరి దమ్ము ఏంటో తేలిపోతుంది… ఆ దమ్ము మీకుందా…? సవాల్ చేశారు.. ఇక, తప్పుడు ప్రచారాలు చేస్తే… కేసులు తప్పవు అని హెచ్చరించారు మంత్రి అనిల్ కుమార్.
Also Read
- Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
- Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
- MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
- Tags
తాజావార్తలు
-
Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
-
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
-
CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
-
Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..