High Court: టీటీడీ ఈవోకు హైకోర్టులో ఊరట.. జైలుశిక్ష, జరిమానాపై స్టే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court: టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో టీటీడీ ఈవోకు నెల రోజుల జైలు, రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు చెప్పారు. అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారం స్టే విధించింది. తమను క్రమబద్ధీకరించేలా టీటీడీ ఈవోను ఆదేశించాలంటూ ముగ్గురు ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన సింగిల్ జడ్జి ధర్మాసనం ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు చెప్పింది. వారిని క్రమబద్ధీకరించాలని టీటీడీ ఈవోకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను అమలు చేయడంలో జాప్యం జరిగింది.
Read Also: Anand Mahindra: ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేసిన.. ఈ సీల్ చేప వేషాలు చూస్తే షాకే
Also Read
ఈ నేపథ్యంలో ఉద్యోగులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ టీటీడీ ఈవో ధర్మారెడ్డికి సింగిల్ జడ్జి ధర్మాసనం నెల రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. దాంతో పాటు రూ.2 వేలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ అంశంపై ఈవో ధర్మారెడ్డి హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. సింగిల్ జడ్జి తీర్పుపై ఈవో ధర్మారెడ్డి హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు బెంచ్.. సింగిల్ జడ్జి తీర్పుపై తాత్కాలికంగా స్టే విధించింది.
తాజావార్తలు
-
NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
-
CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
-
Kolkata: కోల్‌కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
-
Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్‌పై హాట్ చర్చ!
-
Rahul Gandhi: అమెరికా-ఇరాన్‌లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!