NTV Telugu Site icon

Minister Satya Kumar: గత ఐదేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది..

Satya Kumar

Satya Kumar

ఢిల్లీ పర్యటనలో రెండో రోజు పలువురు కేంద్ర మంత్రులను ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కలిశారు. జౌళి శాఖా మంత్రి గిరిరాజ్ సింగ్, అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఈ సందర్భంగా కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వివరించారు. రాష్ట్రంలో చేనేత వస్త్రాల ఉత్పత్తులు పెంచేందుకు చేయూత ఇవ్వాలని గిరిరాజ్ సింగ్ కి మంత్రి విజ్ఞప్తి చేశారు. ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి.. మూడు ప్రదేశాల ప్రత్యేకతలను కేంద్ర మంత్రికి వివరించారు. ధర్మవరంలో సిల్క్ పార్క్, మంగళగిరిలో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ వినతి చేశారు.

Read Also: Revanth Reddy: పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ..రేషన్ కార్డుకు సంబంధం లేదు..

ఇక, తన ప్రతిపాదనకు కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు మంత్రి సత్య కుమార్ తెలిపారు. త్వరలో అమరావతికి వచ్చి అన్ని అంశాలపై చర్చిస్తామని గిరిరాజ్ సింగ్ చెప్పారు.. మంగళగిరి, వెంకటగిరి, ధర్మవరంలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.. చేనేతను ప్రోత్సహించేందుకు, మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపరచడానికి అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వెల్లడించిన ఏపీ ఆరోగ్యమంత్రి వెల్లడించారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడగా.. పర్యావరణ ఉల్లంఘన జరిగిన వివరాలు భూపేంద్ర యాదవ్ కి అందించినట్లు చెప్పుకొచ్చారు. విశాఖపట్నం రుషికొండపై పర్యావరణ ఉల్లంఘన చేయడమే కాకుండా.. వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక కుటుంబం కోసం ప్యాలెస్‌ కట్టారని, ఆ విషయాన్ని తీవ్రంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యకుమార్ కోరారు.

Read Also: Mechanic Rocky: దీపావళి రేసులోకి మెకానిక్ రాకీ.. రిలీజ్ డేట్ ఫిక్స్..

అయితే, అమరావతి సహా రాష్ట్రంలో కీలకమైన ప్రాజక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరులో జాప్యం లేకుండా చూడాలని కేంద్రమంత్రికి సత్యకుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. విశాఖ రుషికొండ వ్యవహారం తన దృష్టికి వచ్చినట్లు భూపేంద్ర యాదవ్‌ చెప్పారని.. గత ఐదేళ‌్ళలో రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అమరావతికి అనుసంధానం అయ్యే జాతీయ రహదారుల అభివృద్దికి పూర్తి సహకారం అందించాలని గడ్కరీని కోరినట్లు పేర్కొన్నారు. జాతీయ రహదారులకు అనుసంధానం అయ్యే రాష్ట్ర రహదారుల అభివృద్ధికి కూడా నిధులు విడుదల చేసే అవకాశాలను పరిశీలించాలని కోరాను.. గత ఐదేళ్ల కాలంలో కేంద్రం విడుదల చేసిన నిధులు పక్కదారి పట్టించడంపై కేంద్ర రవాణా శాఖ మంత్రికి వివరాలు అందించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. తన నియోజకవర్గ కేంద్రం ధర్మవరం నుంచి బెంగళూరుకు జాతీయ రహదారి అనుసంధానానికి అనుమతులు ఇచ్చినందుకు నితిన్‌ గడ‌్కరీకి కృతజ్ఞతలు తెలిపారు.