Purandeswari: విజయవాడలో అమ్మ హాస్పిటల్ డాక్టర్లు దుర్గా శ్రీ లక్ష్మీ, పవన్ కుమార్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే సూచనా చౌదరి ఆహ్వానించారు. మచ్చలేని పార్టీ కావడంతో బీజేపీలో చేరామని డాక్టర్ దంపతులు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజాహిత బడ్జెట్ అన్నారు. కమలం వాణి ఎప్పుడూ ప్రజా వాణి.. సమస్యలపై స్పందించడం, ప్రజల మాట వినిపించడం మా పార్టీ విధానం.. రాజకీయంలో మచ్చలేని పార్టీ బీజేపీ అని చెప్పగలం.. వేలెత్తి చూపలేని పార్టీగా మోడీ పాలనలో బీజేపీ ఉందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు.
Read Also: IND vs NZ: ఇండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. కెప్టెన్ రోహిత్ ఔట్..!
ఇక, గతంలో స్కాముల ప్రభుత్వాలు చూసాం.. మోడీ నేతృత్వంలో స్కీముల ప్రభుత్వాన్ని చూస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 52 శాతం ఓట్లు బీజేపీకి వస్తాయని ఒక సర్వేలో తేలింది.. భారతీయ జనతా పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి.. సుజనా చౌదరి చెప్పినట్టు పశ్చిమ విజయవాడలో తగ్గిన 50 వేల ఓట్లు కూడా కమలం పార్టీకి వస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.