Site icon NTV Telugu

AP Govt Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. బదిలీలకు గ్రీన్ సిగ్నల్

Ap Govt

Ap Govt

AP Govt Gives Green Signal To Transfer Government Employees: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటివరకు ఉద్యోగుల బదిలీపై నిషేధం ఉండగా.. ఇప్పుడు దాన్ని సడలించింది. ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్వర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ.. మే 22 తేదీ నుంచి 31 తేదీ వరకు బదిలీలకు అవకాశం కల్పించింది. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే.. అందులో కొన్ని నిబంధనలు కూడా పెట్టింది. 2023 ఏప్రిల్ నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులును బదిలీలకు అర్హులుగా ప్రకటించిన ప్రభుత్వం.. రెండేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి మాత్రం రిక్వెస్ట్‌పై బదిలీకి అవకాశం కల్పిస్తున్నారు.

Varun Tej: లావణ్య తో వరుణ్ తేజ్ పెళ్లి.. అదేంటి నిహారిక అలా అనేసింది

ఉద్యోగుల బదిలీల్లో ముందుగా గిరిజన ప్రాంతాల్లోని పోస్టులను బదిలీల ద్వారా భర్తీ చేసి, ఆ తర్వాత ఇతర ప్రాంతాలపై దృష్టి పెడతామని ప్రభుత్వం వెల్లడించింది. ఆదాయార్జన శాఖలైన వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, ఎక్సైజు, రవాణా, వ్యవసాయ శాఖలు కూడా నిబంధనలకు అనుగుణంగానే మే 31లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే.. పాఠశాల విద్య, ఇంటర్, సాంకేతిక ఉన్నత విద్యా శాఖలు ఈ బదిలీల ప్రక్రియకు మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. బదిలీ ప్రక్రియలో ఏసీబీ కేసులు, విజిలెన్సు విచారణ పెండింగులో ఉన్న వారి అంశాలను తెలియచేయాలని ఆర్థిక శాక ఆయా శాఖల్ని ఆదేశించింది. జూన్ 1 తేదీ నుంచి మళ్లీ ఉద్యోగుల బదిలీలపై నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది.

Pakistan: “మీ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నారు.. అప్పగించండి”.. ఇమ్రాన్ ఖాన్‌కు పోలీసుల అల్టిమేటం..

గతేడాది జూన్‌లో కూడా ఒకసారి ఉద్యోగుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు బదిలీల ప్రక్రియను చేపట్టింది. ఒకే చోట 5 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పించింది. వ్యక్తిగత వినతులు, పరిపాలనా సౌలభ్యం ఆధారంగా కూడా.. అప్పుడు బదిలీల ప్రక్రియను నిర్వహించడం జరిగింది.

Exit mobile version