ఏపీలో ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నాయి ఉద్యోగ సంఘాలు. ఉద్యోగుల సంక్షేమ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి ఉద్యోగుల ఉద్యమం, సంఘాల తీరుపై కామెంట్స్ చేశారు. సీపీఎస్ రద్దు విషయంలో ప్రభుత్వం సానుకూలతతో ఆలోచిస్తోంది.ఓపీఎస్ విధానం ద్వారా కలిగే లబ్దికి సమానమైన లబ్దిని కలిగించే కొత్త విధానంపై ప్రభుత్వం చర్చిస్తోంది.ఈ నెలాఖరులో ఉద్యోగుల పెండింగ్ బిల్లులను ఈ నెలాఖరులోగా చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.ఒకటో తేదీన జీతాలు చెల్లించే విషయంలో జాప్యం జరుగుతోన్న మాట వాస్తమేనని అంగీకరించారు.
Read Also: Atchannaidu: వచ్చే ఎన్నికలలో చంద్రబాబే సీఎం
ఆర్టీసీని విలీనం చేసుకున్నాం.. వారూ ప్రభుత్వ ఉద్యోగులయ్యారు.గ్రామ సచివాలయ సిబ్బంది, వైద్యారోగ్య శాఖలో కూడా పెద్జ ఎత్తున రిక్రూట్ చేసుకున్నాం.అదనంగా రెండున్నర లక్షలకు పైగా ఉద్యోగులు చేరారు.. దీంతో జీతాల భారం పెరిగింది.ఓన్ సోర్సెస్ నుంచి ఏడాదికి రూ. 1.25 లక్షల కోట్ల మేర ఆదాయం ప్రభుత్వానికి వస్తుంటే.. రూ. 90 వేల కోట్లు జీతాలకే సరిపోతుంది.ఈ నెల 16వ తేదీన పీఆర్సీ ఎరియర్స్ చెల్లింపుల విధానంపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వస్తుంది.ప్రభుత్వం మోసం చేస్తోందని బొప్పరాజు అన్నారని మేం అనుకోవడం లేదు.ఒక్కో సంఘానికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది.బొప్పరాజు కూడా చర్చల్లో సంతృప్తి వ్యక్తం చేశారు.. మరి ఉద్యమాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారో తెలియడం లేదన్నారు చంద్రశేఖర్ రెడ్డి.
Read Also: Student Harassment: అనంతపురంలో విద్యార్థినిపై.. హెడ్ మాస్టర్ లైంగిక వేధింపులు