Head master molested student in anantapur: అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. చదువుకోవడానికి స్కూల్ కు వచ్చిన విద్యార్థినులను ప్రధానోపాధ్యయుడు ఆదినారాయణ లైంగిక వేధింపుల ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దీనిపై డీఈవోకు ఫిర్యాదులు రావడంతో అధికారులు విచారణ చేశారు. ఈ విచారణలో అది వాస్తవమేనని తేలడంతో గురువారం హెడ్ మాస్టర్ ను సస్పెండ్ చేశారు. కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం నల్లగుంట్ల పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ పాఠశాలలో ఈ ఘనత చోటు చేసుకుంది. అక్కడ స్కూల్ లో ఆదినారయణ ఇన్చార్జ్ హెడ్మాస్టర్ గా ఉన్నాడు.
Delhi Medical Student : ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్లింది.. కట్ చేస్తే కత్తిపోట్లకు బలి
స్కూల్లోని ఎనిమిది, తొమ్మిది, పదవ తరగతి విద్యార్థినులపై కొద్ది రోజులుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. అతడి వయసు 31 సంవత్సరాలు. అంత వయసులో మనవరాళ్ల వయసున్న విద్యార్థినులపై వక్రబుద్దిని చూపించాడు. వారి పుట్టుమచ్చలు చూపాలంటూ వేధిస్తున్నాడని విద్యార్థినులు ఆరోపించారు. ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే ఏం జరుగుతుందోనని.. దీంతో పాటు ఆదినారయణ టీచర్ కు భయపడిన స్టూడెంట్స్ ఎవరికి ఈ విసయాన్ని చెప్పుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే జనవరి 24న జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా స్కూల్ లో ఓ కార్యక్రమం జరిగింది. దీనికి స్వచ్చంద సంస్థ ప్రతినిధి హాజరయ్యారు.
Kim Jong Warning: యుద్ధానికి సిద్ధంకండి.. సైనిక డ్రిల్‌లో కిమ్ హాట్ కామెంట్స్
దీంతో బాలికలు తమ గోడు సదరు స్వచ్చంద సంస్థ వద్ద వెల్లబోసుకున్నారు. బాలికలకు ఈ విషయంలో న్యాయం చేస్తానని వారు హామీ ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు ప్రధానోపాధ్యయుడి తీరును గమనించారు. అతడి మీద బాలికలు చేసిన ఆరోపణలు నిజమేనని తేలింది. దీంతో ఈ విషయం మీద అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షికి సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న అధికారులు లైంగిక వేధింపులు నిజమేనని తేల్చారు. దీంతో ఆదినారయణను డీఈవో సస్పెండ్ చేశారు. ఇంచార్జ్ హెడ్ మాస్టర్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
Husband Escaped: ట్రాఫిక్‌లో భార్యని వదిలి భర్త పరార్.. తెరవెనుక ఇంత తతంగమా?
జిల్లా వ్యాప్తంగా ఇలాంటివి ఎక్కడ జరిగినా కఠిన చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి లైంగిక వేధింపులపై తాము విచారణకు వెళ్లిన రోజే విద్యార్థులు భయపడకుండ ముందుకు వచ్చి నిజాలు చెప్పాలని ఆమె అన్నారు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు.. నిజాల్ని నిర్భయంగా చెబితేనే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో మీనాక్షి పేర్కొన్నారు. ఇలాంటి హెడ్మాస్టర్ నిర్వాకంతో విద్యార్థినుల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.