Social Media Ban : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి సోషల్ మీడియా బ్యాన్
- 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం ప్రతిపాదన
- నారా లోకేష్ సూచనతో తీసుకున్న కీలక నిర్ణయం
- సోషల్ మీడియా దుష్ప్రభావాలపై ప్రభుత్వ ఆందోళన
- దేశంలోనే ఏపీ తొలి రాష్ట్రంగా నిలిచే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Social Media Ban in AP : మారుతున్న కాలంతో పాటు సాంకేతికత విస్తరిస్తున్న తరుణంలో, దానివల్ల పిల్లల భవిష్యత్తు చిన్నాభిన్నం కాకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. 13 ఏళ్లలోపు వయసున్న చిన్నారులు సోషల్ మీడియా వాడకంపై పూర్తిస్థాయి నిషేధం విధించే దిశగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.
CM Chandrababu: సూపర్ సిక్స్ అమలు చేశాం.. కేంద్ర పథకాలను పునరుద్ధరించాం.!
Also Read
- AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన!
- Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- OTR: మేయర్ సీటుపై కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య కోల్డ్ వార్
సోషల్ మీడియా వినియోగం వల్ల తలెత్తుతున్న అనర్థాలపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన సూచన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. రాబోయే 90 రోజుల్లో (మూడు నెలల్లో) దీనికి సంబంధించిన పూర్తి విధివిధానాలను ఖరారు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కేవలం 13 ఏళ్లలోపు వారికే కాకుండా, 13 నుంచి 16 ఏళ్ల వయసు గల వారు కూడా సోషల్ మీడియా వాడాలా? వద్దా? అనే అంశంపై ప్రస్తుతం మేధోమథనం జరుగుతోందని, అందరూ అంగీకరిస్తే ఈ వయసు వారిపై కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
చిన్నారులు సోషల్ మీడియాకు బానిసలవ్వడం వల్ల వారి మానసిక స్థితి దెబ్బతినడమే కాకుండా, సమాజంలో క్రైమ్ రేట్ పెరుగుతోందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా అమాయక యువత డిజిటల్ మోసాల బారిన పడుతుండటం. సోషల్ మీడియాలో వస్తున్న వల్గర్ మెసేజ్‌లు, వీడియోలు పిల్లల నైతికతను దెబ్బతీస్తుండటం. చిన్న వయసులోనే సామాజిక మాధ్యమాల ప్రభావంతో ఒత్తిడికి గురవ్వడం వంటి వాటిపై ఆందోళన వ్యక్తమవుతోంది.
“అల్టిమేట్‌గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీల్లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది” అని చంద్రబాబు సభలో ఉద్ఘాటించారు. రాజకీయ పార్టీలైనా, సామాన్య ప్రజలైనా ఎవరైనా సరే సోషల్ మీడియా దుష్ప్రభావాలకు గురికాకూడదనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే, దేశంలోనే పిల్లల కోసం సోషల్ మీడియాపై ఆంక్షలు విధించిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలవనుంది.
AP Assembly: ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
CM Revanth Reddy: కొడంగల్‌లో సీఎం రెండు రోజుల పర్యటన.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
-
Radha Krishna: రాధాకృష్ణులపై కరణ్ జోహార్ భారీ మైథలాజికల్ ఎపిక్.. ‘అవనే శ్రీమన్నారాయణ’ దర్శకుడితో బిగ్ ప్లాన్!
-
Prabhas Fauzi: డార్లింగ్ ఫ్యాన్స్ ఇక తగ్గేదేలే.. ‘ఫౌజీ’ ప్రమోషన్స్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్!
-
TCL P80, P80 Pro: 8GB RAM.. 50MP కెమెరా.. IP68! TCL P80, P80 Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
BCCI-Team India: గౌతమ్ గంభీర్, శుభ్‌మన్ గిల్ కీలక విజ్ఞప్తి.. మాస్టర్ ప్లాన్ వేసిన బీసీసీఐ!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!