AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP UTF Hunger Strike: ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు నిర్వహించనున్న ప్రత్యేక టెట్ పరీక్షను వ్యతిరేకిస్తూ ఏపీ యూటీఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడలో నిరవధిక నిరాహార దీక్ష ఈరోజు ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలకు ధర్నాచౌక్‌లో ఈ దీక్షను ప్రారంభించనున్నట్లు ఉపాధ్యాయ సంఘం నేతలు వెల్లడించారు. ఇన్‌సర్వీస్ టీచర్లకు స్పెషల్ టెట్ నిర్వహణ విషయంలో ప్రభుత్వం తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోలేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము బోధిస్తున్న సబ్జెక్టులోనే ఎక్కువ మార్కులకు ప్రాధాన్యత ఉండేలా టెట్ పరీక్ష విధానంలో మార్పులు చేయాలని వారు కోరుతున్నారు.
టెట్‌లో అర్హత సాధించేందుకు అవసరమైన శాతాన్ని తగ్గించాలని, అలాగే ఉపాధ్యాయుల సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఏపీ యూటీఎఫ్ డిమాండ్ చేస్తోంది. తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే.. నిరవధిక నిరాహార దీక్షను మరింత తీవ్రతరం చేసి, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని ఉపాధ్యాయులు హెచ్చరిస్తున్నారు.
Also Read
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
ఇదిలా ఉండగా రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో స్పెషల్ టెట్ అంశం చర్చకు వస్తుందని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించే తీరుపై తమ తదుపరి కార్యాచరణ ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.
- Tags
- ap
- AP UTF
- AP UTF Hunger Strike
- TET
- UTF
తాజావార్తలు
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
-
Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!