Prabhas Fauzi: డార్లింగ్ ఫ్యాన్స్ ఇక తగ్గేదేలే.. ‘ఫౌజీ’ ప్రమోషన్స్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas Fauzi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడికల్ వార్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’. ‘సీతారామం’ వంటి క్లాసిక్ లవ్‌స్టోరీని తెరకెక్కించిన హను ఈసారి ప్రభాస్‌తో ఓ భారీ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. అయితే ఇప్పటివరకు ‘ఫౌజీ’ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ చాలా తక్కువగానే ఉంది. మేకర్స్ ఇప్పటి వరకు కేవలం లుక్ పోస్టర్స్‌ను మాత్రమే రిలీజ్ చేశారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ‘ఫౌజీ’ ప్రమోషన్స్‌కు సంబంధించి తాజాగా మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ నెలలోనే ఫౌజీ ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని, కంటెంట్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. అంతేకాదు ‘ఫౌజీ’ నుంచి రిలీజ్ చేయబోయే ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని క్రియేట్ చేసేలా ఉంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభాస్ అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ప్రస్తుతం ‘ఫౌజీ’ షూటింగ్ చివరి దశలో కొనసాగుతోంది. అనుకున్నట్లుగా డిసెంబర్ 3న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మిగిలిన షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసే పనిలో చిత్ర బృందం బిజీగా ఉంది. ఈ పీరియాడికల్ వార్ డ్రామాలో ఇమాన్వి హీరోయిన్గా నటిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ నెలలో ఫౌజీ ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ డార్లింగ్ ఫ్యాన్స్‌కి ఎలాంటి సర్ప్రైజ్లు ఇస్తారో చూడాలి.
Also Read
- Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన 'హాయ్'!
- TV Nandi Awards: తిరుపతి వేదికగా 'నంది' అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
- Mamitha Baiju : మమితా బైజు కోరిక తీరేదెన్నడు?
తాజావార్తలు
-
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
-
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లే!
-
Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!