NTV Telugu Site icon

Minister Ramprasad Reddy: ఆ అధికారులే భూ రికార్డులను కాల్చివేశారు..?

Ramprasad Reddy

Ramprasad Reddy

Minister Ramprasad Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలనలో పెద్ద ఎత్తున భూ దోపిడీ జరిగింది అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అని ఆరోపించారు. లక్షన్నర ఎకరాల భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారు.. దేవాలయ, మఠం, ప్రభుత్వ భూముల దోపిడీ జరిగింది.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం 14 మండలాల్లో భూ అక్రమాలకు పాల్పడింది.. వైసీపీ నేతలు భూ అక్రమాలపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది.. సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు.. పెద్ద ఎత్తున 22ఏ భూముల రికార్డులు మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ధ్వసం చేసారు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు బయట పడతాయని రికార్డులను కాల్చేశారు అని ఆరోపణలు గుప్పించారు. అనేక మంది అధికారులు పెద్దిరెడ్డి కోసం పని చేశారు.. ఆ అధికారులే భూ రికార్డులను కాల్చివేతకు పాల్పడ్డారు.. మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో రికార్డ్స్ కాల్చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.

Read Also: CM Stalin: కేరళ ప్రభుత్వానికి తమిళనాడు సీఎం సాయం.. రూ. 5 కోట్లు ప్రకటన

ఇక, అనేక మంది బాధితులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం భూ దోపిడీ పైన ఫిర్యాదులు చేస్తున్నారు అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలను భయపెట్టి పెద్దిరెడ్డి పె ద్దఎత్తున దోపిడీ చేశారు.. రూ. 40 వేల కోట్ల భూ అక్రమాలు గత ప్రభుత్వం హయాంలో జరిగాయి.. భద్రత కోసం కూడా పెద్దిరెడ్డి కుటుంబం చిల్లర రాజకీయాలు చేస్తుంది.. కావాలనే దాడులు సృష్టించుకొని, పోలీసుల వైఫ్యలం పేరుతో డ్రామా ఆడుతున్నారు.. పరదాల ముఖ్యమంత్రి పాలన పోయి.. రాష్ట్రంలో ప్రజా పాలన వచ్చింది.. 60 రోజులు నుంచి రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది.. గడిచిన ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది.. మదనపల్లి ఘటనపై మాజీ సీఎం జగన్ చర్చకు ఎక్కడకు వచ్చిన మేం సిద్ధంగా ఉన్నాం.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు
గన్ మాన్లను తొలగించారు అని రాంప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు.