Diwali Holidays: హిందువులు జరుపుకునే పండుగల్లో దీపావళి కూడా ఒకటి. పండుగ తేదీకి ఓ నెల ముందు నుంచే ఈ పండుగ సందడి వినపడుతుంది. ఇక ఈ పండుగ వస్తుందంటే ముందుగా ఉద్యోగులు, విద్యార్థులు ఓ రోజు సెలవ వస్తుందని ఎదురు చూస్తుంటారు. అయితే ఈ ఏడాది దీపావళి పండుగ ఆదివారం వచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి సెలవు తేదీలో మార్పు చేసిన విషయం అందరికి సుపరిచితమే.. కాగా దీపావళి పర్వదినాన్ని12 వ తేదీన పురస్కరించుకున్నా ఈనెల 13వ తేదీని (సోమవారం) రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవు దినంగా ప్రకటించి ఉద్యోగులకు, విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది.. ఈమేరకు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ జీఓ 2167 ద్వారా 13వ తేదిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి తెలియజేశారు.
Read also:PM Modi: రేపు హైదరాబాద్ కు మరోసారి ప్రధాని మోడీ
ఈ తరుణంలో నవంబర్ 11 వ తేదీ రెండో శనివారం అలానే 12 వ తేదీ ఆదివారం కావడంతో ఒకేసారి పండుగకు 3 రోజులు సెలవులు వచ్చినట్లయింది. కాగా గతంలో ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం.. ఈ నెల 12వ తేదీ (ఆదివారం) దీపావళి సెలవుగా ఉంది. ఈ నేపథ్యంలో సాధారణ సెలవులు, ఆప్షనల్ సెలవుల జాబితాలో స్వల్ప మార్పులు చేసిన ప్రభుత్వం.. నవంబర్ 13వ తేదీన (సోమవారం) ఆప్షనల్ హాలిడే బదులుగా సాధారణ సెలవుగా ప్రకటించింది. అయితే.. తెలంగాణలో మాత్రం దీపావళి సెలవు గురించి ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చేయలేదు.