వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష.. కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హెల్త్‌హబ్స్ ద్వారా ఏర్పాటయ్యే ఆస్పత్రుల్లో కనీసం యాభైశాతం బెడ్లను ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇవ్వాలని స్పష్టం చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్, హెల్త్ హబ్స్, ఆస్పత్రుల నిర్వహణ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లపై సమీక్ష చేశారు.. జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో హెల్త్‌హబ్స్‌పై ఆరా తీశారు.. ఈ సమావేశంలో హెల్త్ హబ్స్ ఏర్పాటు విధివిధానాలపై సీఎంకు వివరాలు అందించారు అధికారులు. ఏయే జిల్లాల్లో ఏ తరహా ప్రత్యేక వైద్య చికిత్సలు అవసరమో గణాంకాలతో వివరాలు అందించారు.. వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న వైద్య చికిత్సల వివరాలను కూడా అధికారులు అందజేశారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఆరోగ్య బీమా కంపెనీలు చెల్లిస్తున్న ఛార్జీలతో పోలిస్తే ఆరోగ్యశ్రీ కింద చెల్లిస్తున్న ఛార్జీలు మెరుగ్గానే ఉన్నాయన్నారు.. ఎవరు ఎక్కువ బెడ్లను ఆరోగ్యశ్రీకి కేటాయిస్తే వారికి హెల్త్‌హబ్స్‌లో ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలన్న సీఎం.. హెల్త్‌హబ్స్ ద్వారా వచ్చే ఆస్పత్రుల బోర్డుల్లో ఒక సభ్యుడు ప్రభుత్వం నుంచి ఉంటారన్నారు.. మన రాష్ట్రానికి చెందిన డాక్టర్లు కూడా ఇక్కడే స్థిరపడి మంచి వైద్య సేవలు అందించే ఉద్దేశం కూడా హెల్త్‌హబ్స్ ద్వారా నెరవేరుతుందన్న సీఎం.. డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉండాలన్నది ఆస్పత్రుల ఎంపికకు ఒక ప్రమాణం కావాలన్నారు.. అవయవ మార్పిడి చికిత్సలు చేసే ఆస్పత్రుల ఏర్పాటుపై హెల్త్ హబ్స్‌లో ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించిన ఆయన.. వైద్యంకోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం ఇక ఉండకూడదని స్పష్టం చేశారు.. లాభాపేక్షలేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్న సంస్థలకూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
Also Read
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
వివిధ వైద్య సంస్థలు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అనుసరిస్తున్న నిర్వహణా విధానాలను సీఎంకు వివరించారు అధికారులు.. ఆస్పత్రుల నిర్వహణకోసం ప్రత్యేక అధికారుల నియామకం ఉంటుందన్నారు.. బిల్డింగ్ సర్వీసులు, ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసులు, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ సేవలను నిర్వహించనున్నట్టు తెలిపారు. దీంతో.. సీహెచ్‌సీల నుంచి బోధనాసుపత్రుల వరకూ నిర్వహణ కోసం అధికారుల నియామకానికి సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.. ఉత్తమ నిర్వహణా పద్ధతులకు అనుగుణంగా కొత్తగా నిర్మిస్తున్న ఆస్పత్రులు, బోధనాసుపత్రుల నిర్మాణాలు ఉండాలని ఆదేశించారు.. ఆస్పత్రుల్లో బెడ్ల నిర్వహణ, బాత్రూమ్ల నిర్వహణ, పరిశుభ్రత, ఆహారంలో నాణ్యత చాలా ముఖ్యమన్న సీఎం.. అలాగే రిసెప్షన్ సేవలు కూడా కీలకం అన్నారు.. సరిపడా వైద్యులు, పైన పేర్కొన్న సేవలు నాణ్యతతో అందితే కార్పొరేట్ ఆస్పత్రుల స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా సేవలు అందుతాయన్న ఆయన.. అత్యుత్తమ నిర్వహణా పద్ధతులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెట్టాలన్నారు.. ఎవరు ఆరోగ్యం బాగోలేకపోయినా అందరూ కూడా ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి ఉండాలన్నారు.. ఆస్పత్రుల నిర్వహణలో పర్యవేక్షణస్థాయి బలోపేతంగా ఉండాలని.. సిబ్బంది సెలవులో ఉన్నందున సేవలకు అంతరాయం రాకూడదన్నారు.. నిర్ణీత రోజులకు మించి సెలవులో ఉంటే.. వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.
కోవిడ్ 19 నివారణ, నియంత్రణ చర్యలతో పాటు వ్యాక్సినేషన్‌పై సీఎంకు వివరాలు అందించారు అధికారులు.. ఏపీలో మొత్తం యాక్టివ్ కేసులు 14,652గా ఉండగా.. పాజిటివిటీ రేటు 2.23 శాతంగా, రికవరీ రేటు 98.60 శాతంగా ఉందని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారు 2699 ఉంటే.. కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నవారు 854 మంది ఉన్నారని.. నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న బెడ్స్ 91.66 శాతం కాగా.. ప్రైవేట్ ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న బెడ్స్ 71.04 శాతం అని తెలిపారు.. ఇక, థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు.. అందుబాటులో ఉన్న ఆక్సిజన్ డీ టైప్ సిలెండర్లు 27,311 కాగా, అందుబాటులో ఉన్న ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు 20,964 అని.. ఇంకా 2493 రావాలని వివరించారు. 50 అంతకంటే ఎక్కువ బెడ్స్ ఉన్న 140 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని.. 11 అక్టోబరు నాటికి 140 ఆస్పత్రుల్లో అందుబాటులోకి పీఎస్ఏ ప్లాంట్లు వస్తాయని తెలిపారు సీఎం వైఎస్ జగన్.. ఇక, ఇప్పటివరకు సింగిల్ డోసు వ్యాక్సినేషన్ పూర్తైన వారు రాష్ట్రంలో 1,33,30,206గా ఉంటే.. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తైన వారు 1,08,54,556 అని.. మొత్తం వ్యాక్సినేషన్ (సింగిల్, డబుల్ డోసు కలిపి) పూర్తైన వారు 2,41,84,762 అని.. వ్యాక్సినేషన్ కోసం వినియోగించిన మొత్తం డోసులు 3,50,39,318గా ఉందని తెలిపారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!