కరోనా థర్డ్‌వేవ్ సన్నద్ధత పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ… మూడోవేవ్ వస్తుందన్న సమాచారంతో గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం అప్రతమతగా ఉండాలి అని కలెక్టర్లకు స్పష్టం చేశారు, థర్డ్‌వేవ్ వస్తుందో, లేదో తెలియదు కానీ , మనం అప్రమత్తంగా ఉండాలి. జిల్లాల వారీ ప్రణాళికల ప్రకారం ఆగస్టు చివరినాటికి అన్నిరకాలుగా సిద్ధం కావాలి. ఆస్పత్రుల్లో అవసరాలమేరకు మౌలిక సదుపాయాలను, ఆక్సిజన్‌బెడ్లను పెంచుకోవాలి అని సూచించారు. అన్నిరకాలుగా మందులు, బయోమెడికల్ ఎక్విప్మెంట్లను సిద్ధంచేసుకోవాలి. స్టాఫ్ నర్సులకు పీడియాట్రిక్ కేర్‌లో శిక్షణ ఇవ్వాలి అని సీఎం జగన్ పేర్కొన్నారు.