CM Jagan: చంద్రబాబు లాంటి నేతల వల్లే మేనిఫెస్టోకు విలువ ఉండటం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Jagan: ఏపీ అసెంబ్లీలో బుధవారం నాడు వ్యవసాయం, అనుబంధ రంగాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. గత 40 నెలల్లో వ్యవసాయ రంగంలో రూ.1,28,634 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. గత మూడేళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని.. సగటున 167.99 లక్షల టన్నుల దిగుబడి వచ్చిందని వెల్లడించారు. రైతు భరోసా ద్వారా 52 లక్షల 38 వేల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించామన్నారు. రైతు భరోసా కింద రూ.23,875 కోట్లు అందించామని పేర్కొన్నారు. ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టాన్ని ఆ సీజన్‌లోనే చెల్లిస్తున్నామని.. దేశంలో ఎక్కడా లేనివిధంగా వాస్తవ సాగుదారులకే బీమా రక్షణ కల్పిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. గత మూడేళ్లలో ఒక్క మండలాన్ని కరవు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదన్నారు. చంద్రబాబు హయాంలో ప్రతి సంవత్సరం కరవు ఉండేదని.. కరవు, చంద్రబాబు ఇద్దరూ కవలలు అని జగన్ ఎద్దేవా చేశారు.
తన హయాంలో కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు చెరువులు, వాగులు, వంకలు కళకళలాడుతున్నాయని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో ఐదు ప్రధాన నదులు పరవళ్లు తొక్కుతున్నాయని… కృష్ణా, గోదావరి డెల్టాలతో పాటు రాయలసీమ, రైతులకు అత్యధికంగా సాగునీరు అందుతుందన్నారు. గత మూడేళ్లలో రికార్డు స్థాయిలో పంట దిగుబడులు. సగటున 13.29 లక్షల టన్నుల దిగుబడి పెరిగిందని.. వైసీపీ హయాంలో రైతులే కాదు.. రైతు కూలీలూ సంతోషంగా ఉన్నారన్నారు. ఆర్బీకేలతో వ్యవసాయం రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని.. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు. ఈ మూడేళ్లలో 98.4 శాతం హామీలు అమలు చేశామని జగన్ తెలిపారు. చంద్రబాబు హయాంలో రైతులకు బీమా పరిహారం అందలేదని ఆరోపించారు. సున్నా వడ్డీ కింద నేరుగా రైతుల ఖాతాల్లో వడ్డీ జమ చేస్తున్నామని.. రైతులకు వడ్డీ రాయితీ నవంబర్‌లో అందిస్తామని చెప్పారు. గత మూడేళ్లలో 65.65 లక్షల మంది రైతులకు రూ.1,282 కోట్లు చెల్లించామన్నారు. బాబు పెట్టిన బకాయిలు రైతులకు తామే చెల్లించామని పేర్కొన్నారు. రుణమాఫీపై చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మార్చారని.. రూ.87,612 కోట్లు రుణమాఫీ చేస్తానని వాగ్ధానం చేశారని… రుణమాఫీ చేయకుండా ఆయన రైతులను దగా చేశారని విమర్శించారు. చివరికి రైతులకు సున్నా వడ్డీని కూడా ఎగ్గొట్టారని మండిపడ్డారు. చంద్రబాబు లాంటి నాయకుల వల్లే మేనిఫెస్టోకు విలువ లేకుండా పోతోందని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
- Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్‌షీట్‌పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
- CM Chandrababu : భూములకు బ్లాక్‌చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
- Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్‌కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
Read Also:Team India: టీమిండియా చెత్త రికార్డు.. ఒకే ఏడాదిలో రెండు సార్లు..!!
రైతు భరోసా కేంద్రాల పరిధిలోకి కిసాన్ డ్రోన్లను తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నామని… రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. మోటార్లకు మీటర్లపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని.. ఎక్కడా ఏ రైతు నుంచి రూపాయి వసూలు చేయలేదన్నారు. మోటార్లకు మీటర్లతో నాణ్యమైన విద్యుత్ అందించగలమని పేర్కొన్నారు. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు రైతులకు అండగా ఉంటున్నామని జగన్ చెప్పారు. అటు ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకున్నామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా సాయం అందిస్తున్నామని… రైతుల కుటుంబాలకు పరిహారం రూ.7 లక్షలు అందిస్తున్నామని తెలిపారు. పట్టాదారు పాసు పుస్తకం ఉన్న ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకున్నామని వెల్లడించారు.
తాజావార్తలు
-
Delhi: జంతర్‌మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
-
ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
-
Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్‌లో రాజకీయ కల్లోలం..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?