Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్‌షీట్‌పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో నమోదైన కేసులకు సంబంధించి సీఐడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్లోని అంశాలపై ముంబై సినీ నటి కాదంబరి జెత్వానీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను, తన కుటుంబ సభ్యులను అన్యాయంగా ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె ఒక వీడియో ప్రకటనను విడుదల చేశారు. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో తమపై ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. దర్యాప్తు సమయంలో తన వాంగ్మూలాన్ని, వాదనలను పూర్తిగా పక్కనపెట్టి వాస్తవాలను వక్రీకరించారని, కొన్ని మీడియా సంస్థలు కూడా అసత్య కథనాలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. దాదాపు రెండున్నర సంవత్సరాల సుదీర్ఘ అన్యాయ పోరాటం తర్వాత తమ కుటుంబం నిర్దోషిగా తేలినప్పటికీ, కేవలం 20 పేజీల సీఐడీ ఛార్జ్‌షీట్‌లో తనపై నిరాధారమైన ఆరోపణలు మోపడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని పేర్కొన్నారు.
ఆర్థిక లావాదేవీలపై స్పష్టత
కుక్కల విద్యాసాగర్ తన ఖాతాలో జమ చేసిన రూ. 4.5 లక్షలు, కాల్ రికార్డులను సీఐడీ నేర ఆధారాలుగా చూపించడంపై జెత్వానీ స్పందించారు. ఆ డబ్బు తాను చేసిన పనికి లభించిన పారితోషికం అని, విద్యాసాగర్ దానిని స్వచ్ఛందంగానే చెల్లించారని స్పష్టం చేశారు. ఇంకా రావాల్సిన బకాయిల కోసం మాత్రమే అతనిని సంప్రదించాల్సి వచ్చిందని, ఇవి ఏమాత్రం నేరపూరిత లావాదేవీలు కావు అని వివరించారు. ఈ స్వల్ప లావాదేవీని రూ. 1.32 కోట్లుగా చిత్రించడం, ఛార్జ్‌షీట్‌లో “తప్పుడు అత్యాచార కేసు బెదిరింపులు”, “బ్లాక్మెయిల్”, “ర్యాకెట్” వంటి తీవ్రమైన పదాలను ఉపయోగించడం ఒక అవివాహిత యువతిపై చేసిన దారుణమైన అన్యాయమని వాపోయారు.
Also Read
- AP ZPTC Elections : ఎంపీటీసీ, జెడ్పీటీసీ బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా విడుదల
- Cyclone Arnab : కోస్తాంధ్రను వణికించనున్న 'అర్నాబ్'.. హైఅలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- Bhumana Karunakar Reddy: నంద్యాల ఘటనలో ప్రధాన నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? భూమన ప్రశ్నలు
- Cyclone Alert: బంగాళాఖాతంలో తుఫాను ముప్పు.. ఏపీ, ఒడిశాకు ఎల్లో అలర్ట్
వేధింపులు , సీఐడీ తీరుపై విమర్శలు
విద్యాసాగర్ నేరపూరిత నేపథ్యం తెలిసిన వెంటనే తాను అతని వివాహ ప్రతిపాదనను తిరస్కరించానని నటి తెలిపారు. దాంతో కక్ష పెంచుకున్న విద్యాసాగర్ తనకు నగ్న సెల్ఫీలు పంపి మానసికంగా వేధించాడని, చివరికి ఆ ఫోటోనే సీఐడీ “అభ్యంతరకర ఫోటో”గా చూపించడం విచారకరమని అన్నారు. ఫిర్యాదుదారుడితో తన పరిచయం , ఆర్థిక లావాదేవీలు పదేళ్ల క్రితమే ముగిసిపోయాయని తెలిపారు. ఇదే వ్యవహారంలో గతంలో గౌరవ న్యాయస్థానంలో జరిగిన విచారణ ఆధారంగా విద్యాసాగర్‌తో పాటు ముగ్గురు సస్పెండైన సీనియర్ ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. సాక్షుల వాంగ్మూలాలను వక్రీకరించి తనపై కేసు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పటికైనా నిష్పాక్షికమైన దర్యాప్తు జరిగి నిజం గెలవాలని ఆమె ఆకాంక్షించారు.
ఛార్జ్‌షీట్‌లో ఆరోపణలను ఖండించిన నటి#
రూ.4.5 లక్షల లావాదేవీలపై వివరణ#
సీఐడీ దర్యాప్తుపై తీవ్ర అభ్యంతరాలు#
నిష్పాక్షిక విచారణ కోరిన కాదంబరి
తాజావార్తలు
-
Swayambhu: ‘స్వయంభు’పై నిఖిల్ అదిరిపోయే అప్డేట్!
-
Tummala Nageswara Rao : గోదావరిలో నీళ్లు ఖతం.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
-
Bengaluru IT Jobs: బెంగళూరులో ఉద్యోగాలు తెలుగు, తమిళులకేనా? యువతి ఆరోపణలపై సీఎం వార్నింగ్!
-
Inter Board: 3,241 కాలేజీలకు ఇంటర్ బోర్డు గుర్తింపు.. వాటిపై క్లారిటీ
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
ట్రెండింగ్
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!