Site icon NTV Telugu

AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు నామినేటెడ్ పోస్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో చేసిన చట్టాన్ని వెనక్కు తీసుకోవడంతో పాటు అందులో లోటుపాట్లు సవరించేలా కొత్తం చట్టం తెచ్చే ప్రతిపాదనపై కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరిగింది. అలాగే, నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కేపాసిటీ బిల్డింగ్ 2025కు ఆమోదం తెలపగా.. పట్టాదార్ పాస్ పుస్తకం చట్ట సవరణకు ప్రతిపాదనపై కేబినెట్ లో చర్చ కొనసాగింది. గాజువాక రెవెన్యూ పరిధిలో భూములు, నిర్మాణాల క్రమబద్దీకరణపై కేబినెట్ ప్రతిపాదన చేసింది.

Read Also: Allu Aravind: సాయి పల్లవిని తీసుకోవడానికి కారణం ఇదే..

అలాగే, ప్రాజెక్టులు మినహా ఏపీ సీఅర్డీఏ చేపట్టే పనులకు టెండర్ల పరిమితి పెంపు కోసం నిబంధనల సవరణకు ఏపీ కేబినెట్ ప్రతిపాదన చేసింది. దీంతో పాటు టీటీడీలోని పోటులో పని చేసే వర్కర్లను సూపర్ వైజర్లుగా అప్ గ్రేడ్ చేస్తూ మంత్రివర్గంలో చర్చ జరిగింది. వీరిని సీనియర్ అసిస్టెంట్ కేడర్కు పదోన్నతి కల్పించే ప్రతిపాదనలు చేశారు. ఇక, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కు డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశ పెట్టే ప్రతిపాదనపై ఏపీ కేబినెట్ చర్చించింది.

Read Also: Shekar Bhasa : బిగ్ బాస్ ఫేమ్ RJ శేఖర్ బాషా పై నార్సింగి పీస్ లో మరో కేసు నమోదు

ఇక, తిరుపతి జిల్లాలోని చెన్నై – బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ లో భూములు కోల్పోయిన వారికి పరిహారంగా ఎకరానికి 8 లక్షల రూపాయల చొప్పున ఇచ్చేందుకు ఏపీ కేబినెట్ లో ప్రతిపాదనలు చేసింది. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నం గ్రామం, కోట మండలంలోని కొత్తపట్నం గ్రామ పరిధిలో పరిహారం పెంపు ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే, భారత్ లో తయారైన విదేశీ మద్యం, బీర్, ఎఫ్ఎల్ స్పిరిట్లపై అదనపు రిటైల్ ఎక్సైజ్ టాక్స్ సవరణకు ప్రతిపాదన చేసింది ఏపీ కేబినెట్.

Exit mobile version