Site icon NTV Telugu

Ap Cabinet: జగన్ లెక్క కుదిరిందా? మంత్రులయ్యేది వీరేనా?

ఏపీ మంత్రివర్గం కూర్పుపై సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కసరత్తు ఆదివారం కూడా కొనసాగనుంది. రేపు మరోసారి సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల. మధ్యాహ్నం 12 గంటలకు వీరిద్దరూ భేటీ కానున్నారు. ఇవాళే తుది జాబితా సిద్ధం చేసే దిశగా కసరత్తు ప్రారంభం అయినా ఇంకా కొలిక్కిరాలేదని తెలుస్తోంది. సీఎం, సజ్జల వరుస భేటీల పై ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు వీలుగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సంబంధిత శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆహ్వాన పత్రికలు కూడా రెడీ అయ్యాయి. .బ్లూబుక్ లోని నిబంధనల ప్రకారం నూతన మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు సంబంధిత శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.

11వతేదీన కరకట్ట రోడ్డును గవర్నర్,ముఖ్యమంత్రి,హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇతర న్యాయమూర్తులు, మంత్రులుగా నియమించబడిన వారికి, ఎంపీ, ఎంఎల్ఏలు, ఎమ్మెల్సీలు వంటి ప్రముఖుల వాహనాలు ప్రమాణ స్వీకార ప్రాంతానికి చేరుకునేలా రిజర్వు చేస్తున్నట్లు తెలిపారు. మిగతా వారి వాహనాలు ఇతర మార్గాల్లో వచ్చేలా తగిన ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేస్తున్నారు.

వివిధ జిల్లాల వారీగా మంత్రులయ్యేది వీరేనని ప్రచారం సాగుతోంది. అనుభవం, సామాజిక సమీకరణాలు, సార్టీకి విధేయత ఆధారంగా మంత్రివర్గ కూర్పు సాగుతోంది. మంత్రుల ప్రమాణ స్వీకారానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేదిక, హై-టీ కోసం విడివిడిగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసే మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పాసులను సిద్దం చేసింది జీఏడీ. శ్రీరామపట్టాభిషేకం ముహుర్తానికే మంత్రుల ప్రమాణస్వీకారం వుంటుందని తెలుస్తోంది.

10 మంది మంత్రులు కొనసాగుతారని అంటున్నారు. బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, పేర్నినాని, వేణుగోపాల కృష్ణ, ఆదిమూలపు సురేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మనూరు జయరాం, కొడాలి నాని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిని కొనసాగిస్తారని తాడేపల్లిలో వార్తలు వస్తున్నాయి.

జగన్ కేబినెట్లో వివిధ కులాల ఈక్వేషన్స్..

బీసీలు-9 మంది లేదా 10
ఎస్సీలు-5 లేదా 6
ఎస్టీలు-2
మైనారిటీలు-1
కాపులు-1
కమ్మ-1
రెడ్లు-3

Exit mobile version