ఏపీ మంత్రివర్గం కూర్పుపై సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కసరత్తు ఆదివారం కూడా కొనసాగనుంది. రేపు మరోసారి సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల. మధ్యాహ్నం 12 గంటలకు వీరిద్దరూ భేటీ కానున్నారు. ఇవాళే తుది జాబితా సిద్ధం చేసే దిశగా కసరత్తు ప్రారంభం అయినా ఇంకా కొలిక్కిరాలేదని తెలుస్తోంది. సీఎం, సజ్జల వరుస భేటీల పై ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.…