AP Cabinet: ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ముగిసింది. ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అలాగే, రాజధాని నిర్మాణం లో మరో కీలక ముందడుగు పడింది.రాజధాని అమరావతి కోసం భూ సేకరణ కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. భూములు ఇవ్వని కొందరు రైతుల నుంచి. భూసేకరణ చట్టం 2013 ద్వారా భూములు తీసుకోవాలని కేబినెట్. లో నిర్ణయం తీస్కున్నారు మేరకు ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read Also: Scuba Diving: స్కూబా డైవింగ్ ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన ఆపిల్ వాచ్.. ఎలాగంటే..!
అలాగే, జలవనరుల శాఖ పనులకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేలు ఇచ్చే ప్రతిపాదనకు సైతం కేబినెట్ ఆమోదించింది. కారవాన్ పర్యాటకానికి ఆమోదం లభించింది. అమృత్ 2.0 పథకం పనులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అమరావతిలో పనుల కోసం ఎస్‌పీవీ ఏర్పాటుకు ఆమోదం లభించింది. పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసేందుకు కేబినెట్ ఆమోదించింది. ఇక, ‘కుష్టు వ్యాధి’ పదం తొలగించే చట్ట సవరణ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యుత్ శాఖకు సంబంధించి పలు పనులకు ఆమోదం తెలిపారు. అలాగే, కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలకు సైతం మంత్రి మండలి ఆమోదం లభించింది.