ఏపీ కమల దళంలో కుదుపు కనిపిస్తోంది. సోము వీర్రాజుపై ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తాజా పరిణామాలపై తనదైన రీతిలో స్పందించారు. అమరావతి చేరుకున్న సోము వీర్రాజు.. ఒంగోలు బయల్దేరి వెళ్లారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని కలిసి సంఘీభావం తెలిపారు. మా నాయకుడిని చంద్రబాబు కలిశారు.. మేం స్వాగతిస్తున్నాం. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా ప్రజాస్వామ్యంపై దాడి జరిగింది.
Read Also: Rats Bite Notes: నోట్లు కొరికేసిన ఎలుకలు…లబోదిబోమంటున్న బాధితుడు
అమిత్‌షాపై రాళ్లదాడి చంద్రబాబు హయంలోనే జరిగింది. చంద్రబాబు తన హయాంలో జరిగిన విషయాలను గుర్తుంచుకుంటే మంచిది. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఉమ్మడి ఉద్యమం చేసే అంశంపై..మీడియా తొందరపడి మమ్మల్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో అన్నీ ఉంటాయి. కన్నా కామెంట్లను అదే విధంగా చూస్తున్నాం. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా కామెంట్లపై ఇంతకు మించి మాట్లాడకూదు. అన్ని పరిణామాలు అధిష్టానం దృష్టిలో ఉన్నాయన్నారు.
బీజేపీ ఏపీ కో-కన్వీనర్ సునీల్ ధియోధర్ మాట్లాడుతూ.. జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందన్నారు. వైసీపీ-టీడీపీల్లో ఒకరు నాగరాజు.. మరొకరు సర్పరాజు. వైసీపీ-టీడీపీలు రెండూ దొంగల పార్టీలే. భవిష్యత్తులో టీడీపీతో పొత్తు ఉండదు. వైసీపీ గుండాయిజంపై మా పోరాటం కొనసాగుతుంది. కన్నా కామెంట్లపై సోము వీర్రాజు చెప్పారు.. అంతకు మించి నేను చెప్పదేం లేదు. రోడ్ మ్యాప్ విషయమై ఎలాంటి గందరగోళం లేదు. విశాఖ ఘటన విషయంలో బీజేపీ నేతలు చాలా మంది పవన్ కళ్యాణ్ తో మాట్లాడారు.. సంఘీభావం తెలిపారు. కుటుంబ, అవినీతి పార్టీలపై బీజేపీ పోరాటం కొనసాగిస్తాం అన్నారు సునీల్ ధియోధర్.
Read Also:Rashmika Mandanna: ఆ స్టార్ హీరోతో ఆపని ఒప్పుకున్న రష్మిక.. మరీ ఇలా తెగించాలా?
