NTV Telugu Site icon

Somu Veerraju: ఇద్దరూ కలిసి రాజధాని లేకుండా చేశారు.. ఛాలెంజ్‌ చేస్తున్న బీజేపీ ఏం చేసిందో చెప్పడానికి..!

Somu Veerraju

Somu Veerraju

ఆంధ్రప్రదేశ్‌కు భారతీయ జనతా పార్టీ ఏం చేసింది చెప్పేందుకు నేను సిద్ధం.. దీనిపై ఎవరు చర్చకు వస్తారో రావాలని సవాల్‌ చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు.. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్నారు సోమువీర్రాజు.. ఈ సందర్భంగా.. అమరావతి రైతులు ఆయన్ను కలిశారు.. అమరావతి రైతులు పాదయాత్రకు ఆహ్వానించారు.. రైతులకు అండగా నిలుస్తున్న బీజేపీకి కృతజ్ఞతలు తెలిపారు అమరావతి జేఏసీ నేతలు.. అయితే, ఏపీలో వినాయక చవితికి జగన్ పర్మిషన్ కావాలి? అని మండిపడ్డారు వీర్రాజు.. గతంలో కోవిడ్ ఉందని నిబంధనలు పెట్టారు.. అప్పట్లో కోవిడ్ నిబంధనలు హిందూ పండగలకు మాత్రమే నని ఆగ్రహం వ్యక్తం చేశారు..

Read Also: YSRCP: సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరిన గంజి చిరంజీవి

ఇక, తెలుగు దినోత్సవం ఉత్తర్వులను కూడా ఇంగ్లిష్ లోనే ఉన్నాయి.. సీఎం వైఎస్‌ జగన్‌కు ఇంగ్లీష్ పై అంతా ప్రేమ ఎందుకో..? అని ప్రశ్నించారు సోము వీర్రాజు.. మరోవైపు, సీఎం జగన్ కు ఐదు కిలోమీటర్ల రోడ్డు వేసే దమ్ము లేదని ఎద్దేవా చేసిన ఆయన.. అటు తెలుగు దేశం పార్టీ, ఇటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు.. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.. ఛాలెంజ్ చేస్తున్న రాష్ట్రనికి బీజేపీ ఏం చేసిందో చెప్పటానికి.. ఎవరైనా చర్చకు రండి అన్నారు.. ఏపీలో ఏ ప్రతిపక్షం చేయలేని ఉద్యమాలు మేం చేశామన్న ఆయన.. రాష్ట్రంలో ప్రజా పక్షంలో పని చేస్తున్న పార్టీ.. బీజేపీ మాత్రమేఅన్నారు. ఇక, పెట్రోల్ కు ప్రత్యామ్నాయంగా ఇథనాల్ ను కేంద్రం ముందుకు తీసుకొస్తుందని తెలిపారు సోము వీర్రాజు.