ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ కీలక బిల్లులకు ఆమోదం తెలపనున్నారు.. మూడు రోజుల గ్యాప్ అనంతరం ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి ఏపీ అసెంబ్లీ సమావేశాలు… ప్రశ్నోత్తరాలు, దేవదాయ, ఎక్సైజ్ శాఖలకు చెందిన బిల్లులను ఆమోదించనుంది సభ.. అసెంబ్లీలో వివిధ పద్ధులపై చర్చించి ఆమోదం తెలపనున్నారు.. ఇక, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టు ప్రగతిపై స్వల్ప కాలిక చర్చ సాగనుంది.. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చకు వచ్చే అంశాల విషయానికి వస్తే.. సీఎంఆర్ఎఫ్, మత్స్యకారులకు ఆర్ధిక సాయం, వైజాగ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇన్పుట్ సబ్సిడీ లాంటివి ఉండగా.. ప్రశ్నోత్తరాల్లో చర్చకు వచ్చే అంశాల విషయానికి వస్తే.. ఎంపీఈవోలకు కనీస వేతనం, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, ఆశా వర్కర్ల జీతాలు, ఎంఎస్ఎంఈ ప్రొత్సాహాకాలు, కోవిడ్ నష్ట పరిహరం, ఆర్టీసీ బలోపేతం ఉన్నాయి.
Read Also: TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్
మరోవైపు ఉదయం 10 గంటలకు శాసన మండలి ప్రారంభం అవుతుంది.. ప్రశ్నోత్తరాల అనంతరం అంతరాష్ట్ర జల వివాదాలపై కాలింగ్ అటెన్షన్ కింద మండలిలో చర్చ జరగనుంది.. ఇకచ కాలింగ్ అటెన్షన్ నోటీనిచ్చారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్.. ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణంపై స్వల్ప కాలిక చర్చ జరగబోతోంది.. మండలి ప్రశ్నోత్తరాల్లో చర్చకు వచ్చే అంశాల విషయానికి వస్తే.. కృష్ణపట్నం ధర్మల్ పవర్ స్టేషన్, ఏపీఎస్ఎఫ్ఎల్‌లో అవినీతి, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు, పోలీస్ ఉద్యోగుల సంక్షేమం ఉండగా.. జగనన్న చేదోడు, ఎస్సీ, ఎస్టీల్లో కొన్ని కులాల చేరిక, సమ్మిళిత అభివృద్ధి, రజక కులాల చెరువుల ఆక్రమణ, జగనన్న గోరు ముద్దపై కూడా చర్చ సాగనుంది.