AP Assembly: సెల్ ఫోన్లకు నో పర్మిషన్… స్పీకర్ రూలింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతీ రోజు నిరసనలు, ఆందోళనకు కొనసాగుతున్నాయి.. ఇప్పటికే పలు దఫాలుగా టీడీపీ సభ్యులను సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.. ఇక, ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఏడోరోజు బడ్జెట్ సమావేశాల్లోనూ నిరసనలు తప్పలేదు.. మరోవైపు సభలోకి సెల్ ఫోన్లు తీసుకురావడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం.. దీనిపై స్పీకర్ తమ్మినేని రూలింగ్ ఇచ్చారు. అయితే, స్పీకర్ రూలింగ్‌పై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.. సభలో జరుగుతున్న పరిణామాలను సెల్ ఫోన్‌తో రికార్డు చేసి మీడియాకు టీడీపీ సభ్యులు చేరవేస్తున్నారని సమాచారం తనకు ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు స్పీకర్.
Read Also: COVID 19: మరో కొత్త వేరియంట్.. భారత్‌లో కలవరం..!
Also Read
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
- Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్‌పై పవన్ కీలక ఆదేశాలు
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
అయితే, వైసీపీ సభ్యులు కూడా సెల్ ఫోన్లు తీసుకువస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు వాదించారు.. కానీ, సభలోకి ఎవ్వరూ సెల్ ఫోన్లు తీసుకు రాకూడదని స్పష్టం చేశారు స్పీకర్.. ఎవ్వరి మనోభవాలు దెబ్బతినకుండా ఉండాలంటే సెల్ ఫోన్లను సభలోకి అనుమతించకపోవడమే సరైన విధానం అన్నారు.. సెల్ ఫోన్లను వాలంటరీగా సరెండర్ చేయాలని తెలిపారు.. టీడీపీ సభ్యులు స్పీకర్ సూచనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మరోవైపు, మార్షల్స్ నెట్టేస్తున్నారన్న అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు టీడీపీ సభ్యులు.. అయితే, మార్షల్స్ వారి విధులను వాళ్లు నిర్వహిస్తున్నారని స్పీకర్ స్పష్టం చేశారు. కాగా, ఏడో రోజు బడ్జెట్ సమావేశాల్లోనూ టీడీపీ సభ్యుల నిరసన, స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడం.. జంగారెడ్డి గూడెం ఘటనను ప్రస్తావించడం వంటి పరిణామాలతో సభలో కాసేపు హాట్‌హాట్‌గా మారిపోయింది.
తాజావార్తలు
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్‌ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Sunrisers: బోణి కొట్టిన సన్ రైజర్స్.. ఎమ్ఐ లండన్‌పై ఘన విజయం..
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!