NTV Telugu Site icon

Chalasani Srinivas: గుజరాత్ పాలకుల కాళ్ళ కింద తెలుగు రాష్ట్రాలు ఉండాలా

Chalasani

Chalasani

Chalasani Srinivas: విజయవాడలో ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎన్డీయే ప్రభుత్వం ఏపీపై కక్ష సాధింపు చర్యలకు దిగింది అని ఆరోపించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఆస్తులను తెలంగాణకు అప్పగించా రు.. విభజన హామీల అమలు కోసం నాటి తెలంగాణ ప్రభుత్వం కృషి చేయలేదు.. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై దుర్మార్గంగా వ్యవహరించింది.. అదాని నేతృత్వంలో మోడీ ప్రభుత్వం నడుస్తుంది.. గుజరాత్ పాలకుల కాళ్ళ కింద తెలుగు రాష్ట్రాల ఉండాలా అని ఆయన ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యను పరిష్కారం చేయాల్సింది కేంద్రం.. సుప్రీం కోర్టు న్యాయమూర్తితో కమిటీ వేయాలంటే ఎందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు అని చలసాని శ్రీనివాస్ వెల్లడించారు.

Read Also: Cheating Lady : నిత్య పెళ్లి కూతురు.. 40 ఎళ్ళ దాటినా పెళ్ళి కాని ప్రసాద్ లే సంధ్య మెయిన్ టార్గెట్ …

ఇక, రేవంత్ రెడ్డి చంద్రబాబుకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. నిన్న జరిగిన సమావేశం చారిత్రాత్మక అడుగులు వేస్తోందనీ భావించాం.. విలీన మండలాలను తెలంగాణకు అప్పగించే అంశంలో కేంద్రం.. ముంపు మండలాలు మొత్తం విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ లో కలిపారు అని తెలిపారు. విలీన మండలాలు మొత్తం కూడా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గ్రామాలే.. తెలంగాణ ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం జరుగుతుంది.. ముంపు గ్రామాలు మొత్తం ఏపీలో భాగమే.. భద్రాచలం రాముల వారికి దాతలు ఇచ్చిన ఆస్తులు మొత్తం ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇక, ఏపీ సీఎం తెలంగాణ ముఖ్యమంత్రికి జై ఆంధ్ర- జై తెలంగాణ పుస్తకాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను.. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

Read Also: Darling Trailer: నా పెళ్లాం బెల్లం రా.. నవ్వులు పూయిస్తున్న డార్లింగ్ ట్రైలర్!

కాగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆస్తుల పంపకాల విషయంలో జోక్యం చేసుకోవాలి అని చలసాని శ్రీనివాస్ కోరారు. ఏపీ ప్రభుత్వాన్ని అదాని ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేస్తుంది అని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు రీ హాబిటేషన్ పూర్తి చేయాలి.. ఆస్తుల పంపకాల విషయంలో పంతాలకు పోవద్దు.. తూర్పు గోదావరి జిల్లాలోని భూముల్లో ఉన్న బొగ్గు తవ్వుకోవడానికి సింగరేణి కాలరీస్ కు హక్కులు ఉన్నాయి.. ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు తెలుగు ప్రజల రక్తంతో కట్టారు.. తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులను అదానికి కట్టబెట్టొదు అని సూచించారు. ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు, విభేదాలు ఉంటే న్యాయ నిపుణులతో కమిటీలు వేద్దాం అని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు అన్నారు.

Read Also: CM Revanth Reddy: రేపు ఏపీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..!

అయితే, రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం కోసం పటోడిలకు, జైన్లకు మనం అప్పగించాల్సిన అవసరం లేదు అని చలసాని శ్రీనివాస్ చెప్పారు. మిగులు జలాల విషయంలో అన్యాయం చేసేలా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసింది.. 13 కోట్ల ప్రజలకు అన్యాయం చేసేలా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.. తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం లేకనే ఇబ్బందులు వస్తున్నాయి.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయం తెలుసుకోవాలి.. బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నారు.. హోదా ముగిసిన అంశం అనే వాళ్ళు ఆంధ్ర ద్రోహులు అని మండిపడ్డారు. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఏపీలో నడుస్తోంది.. రాష్ట్ర హక్కుల కోసం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయ్యాలని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.