Site icon NTV Telugu

Pinnelli: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై మరో కేసు నమోదు..

Pinnelli

Pinnelli

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదు అయింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కోర్టుకు హాజరు పరుస్తున్న సమయంలో తెలుగు యువత జిల్లా కార్యదర్శి కొమర శివపై పిన్నెల్లి దాడి చేసిన అంశంపై ఐపీసీ సెక్షన్ 323 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనం దిగి వైసీపీ కార్యకర్తలతో కరచాలనం చేస్తుండగా.. అదే సమయంలో తెలుగు యువత జిల్లా కార్యదర్శి శివ కూడా ఎదురుపడ్డాడు.. దీంతో మాజీ ఎమ్మెల్యే పిడికిలి బిగించి శివ కడుపుపై గుద్దడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక, ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు మాజీ ఎమ్మెల్యేపై కేసు ఫైల్ చేశారు.

Read Also: Delhi Airport : ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కూలిన పైకప్పు.. ఆరుగురికి గాయాలు.. చాలా వాహనాలు ధ్వంసం

ఇక, పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల అదనపు జూనియర్‌ సివిల్‌ కోర్టు రెండు కేసుల్లో 14 రోజుల రిమాండ్‌ విధించింది. గురువారం జడ్జి ఎస్‌.శ్రీనివాస కల్యాణ్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కారంపూడిలో సీఐ నారాయణస్వామిపై హత్యాయత్నం, పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో టీడీపీ ఏజెంట్‌ పై దాడి కేసుల్లో జడ్జి ఆయనకు రిమాండ్‌ విధించారు. ఈవీఎం ధ్వంసం కేసు, పాల్వాయిగేటు వద్ద మహిళను దూషించిన కేసుల్లో మాత్రం పిన్నెల్లికి బెయిల్‌ వచ్చింది.

Exit mobile version