Delhi Airport : ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కూలిన పైకప్పు.. ఆరుగురికి గాయాలు.. చాలా వాహనాలు ధ్వంసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Airport : ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. భారీ వర్షం మధ్య టెర్మినల్-1లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన వెంటనే, విమానాశ్రయం పైకప్పు కూలిపోవడంతో చాలా వాహనాలు శిథిలాల కింద చిక్కుకున్నాయి. పోలీసులు, అగ్నిమాపక శాఖ మూడు వాహనాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.
Read Also:Elephant Attack : మేఘాలయలో ఏనుగుల గుంపు దాడి.. ఎస్ఐ మృతి, కానిస్టేబుల్‌కు గాయాలు
Also Read
ఈ ప్రమాదం తెల్లవారుజామున 5.30 గంటలకు జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో విమానాశ్రయం పైకప్పు కూలిపోవడంతో పలు వాహనాలు కింద పడి ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ రక్షించి ఆసుపత్రికి తరలించారు. అతడికి చికిత్స కొనసాగుతోంది. ప్రమాదం తర్వాత, దేశీయ విమానాశ్రయ టెర్మినల్ వెలుపల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చాలా వరకు వాహనాలు బారులు తీరుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. టెర్మినల్ పైకప్పు ఎలా కూలిపోయిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Read Also:Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం..
ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ, “ఉదయం 5.30 గంటలకు, ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్-1 వద్ద పైకప్పు కూలిపోవడం గురించి మాకు సమాచారం అందింది. ఘటనాస్థలికి మూడు అగ్నిమాపక వాహనాలను పంపించారు. అక్కడ మంటలు చెలరేగినట్లు గుర్తించారు. దీని తరువాత, విమానాశ్రయం పైకప్పు ఒక భాగం కూలిపోయింది. కింద పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పలు వాహనాలు పైకప్పు శిథిలాల కింద కూరుకుపోయాయి. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. వారిని రక్షించి సమీపంలోని ఆస్పత్రికి తరలించాం.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!