Software Engineers Death: పోటీపడి 19 బీర్లు తాగిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపుతోంది.. అన్నమయ్య జిల్లా కె.వి.పల్లి మండలం బండ వడ్డీపల్లిలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది.. అతిగా మద్యం సేవించడమే మృతికి కారణమని రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆరుగురు స్నేహితులు కలిసి పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ పార్టీ సమయంలో మణికుమార్ (34), పుష్పరాజ్ (26) అనే ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు పరస్పరం పోటీపడి మద్యం సేవించారు. గత శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు ఇద్దరూ కలిసి మొత్తం 19 బడ్‌వైజర్ టిన్ బీర్లు తాగినట్లు పోలీసులు గుర్తించారు. అతిగా మద్యం సేవించడం వల్ల తీవ్ర డీహైడ్రేషన్‌కు గురైన ఇద్దరి పరిస్థితి విషమించింది. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మణికుమార్ మార్గమధ్యలో మృతి చెందగా, పుష్పరాజ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రాథమిక విచారణలోనూ, పోస్టుమార్టం నివేదికలోనూ మృతికి అతిగా మద్యం సేవించడమే కారణమని స్పష్టమైనట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also: Uttarakhand: కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడిపై దాడి.. ఐసీయూలో చేరిక