ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు, కర్నూలు, రహదారిలో లారీ వేగంగా వచ్చి ఆటోని ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే ఐదుగురు మరణించారు.. ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందగా మరొక ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. సంతమాగులురు రోడ్డు దగ్గర ఈ ప్రమాదం జరిగింది.
మృతులంతా పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన వారిగా గుర్తించారు. చనిపోయిన వాళ్లు ఆర్కెస్ట్రా గ్రూప్ సభ్యులు.. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.. లారీ డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ప్రమాదం జరిగిందని పోలీసుల విచారణలో తేలింది.. ఆ రోడ్డు మొత్తం రక్తంతో తడిసింది.. గుంటూరు , కర్నూలు రహదారిలో సంతమాగులూరు దగ్గర ఆర్కెస్ట్రా బృందంతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఆటోలో ఉన్న వాళ్లలో ముగ్గురు స్పాట్‌లో మృతి చెందారు. మరొక ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
ప్రమాదంలో చనిపోయిన వాళ్లు, గాయపడ్డవారు పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన వారిగా గుర్తించారు. స్థానికులిచ్చిన సమాచారంతో ఘటన స్తలానికి చేరుకున్న పోలీసులు నుజ్జు నుజ్జైన ఆటోలోంచి క్షతగాత్రులను బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.. ఈరోజు తెల్లవారు జామున సంతమాగులూరు దగ్గర ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఆర్కెస్ట్రా గ్రూప్‌కి చెందిన బాధితులు వినుకొండ నుంచి నరసరావుపేటకు వెళ్తుండగా ఈదుర్ఘటన జరిగింది.. ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది..